గమనిక: పూజ ముగిసిన తరువాత తప్పక వినాయక చరిత్రను, పూర్తిగా చదవాలి అప్పుడే వినాయకుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.
శ్రీ వినాయక పూజకు కావాల్సిన సామాగ్రి:
దీపారాధనకు దీపాలు / ప్రమిదలు - 2
గంట - 1
హారతి ప్లేట్ - 1
ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్ధరణి, చిన్న పళ్లెం,
నూనె లేదా ఆవు నెయ్యి
అగర్భత్తులు/ సాంబ్రాణి - 1 ప్యాకెట్
అగ్గిపెట్టె
చిన్న పీట లేదా ఆసనం - 1
ఒక పాత్రం లో నీరు పూజ చేసే వారు ఆచమనం చేయడానికి
పసుపు 25గ్రా.
కుంకుమ 25 గ్రా.
పసుపు గణపతి- మట్టితో చేసిన గణపతి పూజకు శ్రేష్టం1/2 kg
అగరవత్తులు 1 పేకట్
ప్రత్తి (ఒత్తులకు, వస్త్రయుగ్యమునకు, యజ్ఞోపవీతమునకు)
పంచామృతములు (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు)
గంధము
వక్కలు
హారతి కర్పూరం
పూలు(అష్టోత్తరనామావళి కొరకు విడి పూలు మరియు వినాయక విగ్రహం లేదా పటానికి పూల మాల)
అరటి పండ్లు
కొబ్బరికాయలు
21 రకాల పత్రి (మాచి పత్రం, బృహతీ పత్రం, బిల్వ పత్రం, దూర్వాయుగ్మం పత్రం, దత్తూర పత్రం, బదరీ పత్రం, ఆపామార్గ పత్రం, తులసీ పత్రం, చూత పత్రం, కరవీర పత్రం, విష్ణుక్రాంత పత్రం, దాడిమీ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజి పత్రం, గండలీ పత్రం, శమీ పత్రం. అర్జున పత్రం, అర్మ పత్రం మరియు అశ్వత్థ పత్రం)
నైవేద్యాలు (బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు)
గమనిక: కొంత ప్రయత్నిస్తే ఈ పత్రాలు అన్నీ సులభంగా లభిస్తాయి. ఒకవేళ అన్ని పత్రాలు దొరకకపోతే, లేని వాటికి బదులుగా ఈ 21 పాత్రలలోనే ఏవైతే ఎక్కువగా లభిస్తాయో వాటిని లేదా గరికను వినాయకుడికి సమర్పించవచ్చు. గణపతికి ఇష్టమైన ఈ 21 పత్రాల వెనుక ఔషధ గుణాలు, ఆరోగ్య రహస్యాలు వున్నది కనుక వీటికి బదులుగా వేరే పత్రాలను సమర్పించకూడదు.
పూజకు ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి:
మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి.
అలా అన్నింటినీ సిద్ధం చేసుకున్న తరువాత ఈ క్రింద శ్లోకంతో పూజకు ముందు మనం చేయాల్సిన శారీరక శుద్ధి మరియు సంకల్పం చెప్పి పూజను ప్రారంభించాలి.
పూజకు ముందుగా చేయవలసిన కొన్ని పనులు:
వినాయక చవితినాడు తెల్లవారుజామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో అందరూ తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. దేవుడి గదిలో లేదా ఈశాన్యమూల స్థలాన్ని లేదా వీలుగా ఉండే తూర్పు/ఉత్తర దిశలలో శుద్ధిచేయాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టి, దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గును వేయాలి. పాలవెల్లిని పండ్లతో అలంకరించి దానికింద ఉంచిన పీటపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి.
పూజచేసేవారు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కూర్చునేందుకు మరోపీట లేదా ఒక ఆసనమును వేసుకోవాలి. పూజ చేసుకొనే మగవారు పంచె/దోతీను కట్టుకోవడం శ్రేష్టం. తదుపరి ఒక తాంబూలం మూడు ఆకులు (తమలపాకు కొసలు చేతివేళ్ల చివరలను తాకాలి), రెండు వక్కలు, రెండు పళ్లు, చిల్లరి పైసలు పెట్టి పట్టుకోవాలి.
తర్వాత కింది శ్లోకములను చదువుకోవాలి…తదేవలగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం తదేవ
లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్
అని చదువుతూ పీటమీద తూర్పుముఖంగా కూర్చోవాలి.
ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమబొట్టు పెట్టాలి.
ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని,
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా|
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచిః ||
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ||
కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి కింది ప్రాణాయామ మంత్రమును చెప్పుకొనవలెను.
కలశారాధన:
తదంగ కలశ పూజాం కరిష్యే…
కలశం అంటే ఆచమన పాత్ర కాకుండా నీళ్ళు వుండే మరొక పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరచేతితో కింద పట్టుకొని కుడి అరచేతితో పైన పట్టుకుని కింది శ్లోకమును చదవవలెను.
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః ||
గణానాంత్వాం గణపతిగ్ం హవామహే, కవిం కవీనా ముపమశ్రవస్తమం
2. శ్రీ మహా గణాధిపతి యై నమః :- ఆవాహయామి – ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి వద్ద వుంచవలెను
3. శ్రీ మహా గణాధిపతి యై నమః :- రత్న సింహాసనం సమర్పయామి- కొన్ని అక్షతలు సమర్పించవలెను
4. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- పాదయోః పాద్యం సమర్పయామి – పుష్పం తో నీరు దేవుడికి పాదములు కడగాలి – కడిగినట్టు భావించాలి
5. శ్రీ మహా గణాధిపతి యై నమః :- దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి – పుష్పంతో నీరు దేవుడి చేతులు కడగాలి – కడిగినట్టు భావించాలి
6. శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి – పుష్పంతో నీరు దేవుడికి ముఖం కడుగుటకు ఇవ్వాలి
7. శ్రీ మహా గణాధిపతి యై నమః :- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి – పుష్పం తో నీరు దేవుడికి మధుపర్క స్నానానికి సమర్పించాలి
8. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి – పుష్పం తో నీరు దేవుడికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి
9. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి – వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి – వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి
10. శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి – కుంకుమ ధారణ చేయాలి
11. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి – యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి – అక్షతలు వేయాలి
12. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శ్రీ గంధాం ధారయామి -గంధం సమర్పించాలి
13. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సర్వాభరణాన్ ధారయామి – అక్షతలు సమర్పించాలి
14. ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి – పువ్వులు/ అక్షతలు సమర్పించాలి
15. ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని చదువుకొన వలెను.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచం ద్రాయ నమః,
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః,
ఓం శూర్పక ర్ణాయ నమః,
ఓం హేరంభాయ నమః,
ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం గణాధిపతయే నమః.
షోడశ నామ పూజా సమర్పయామి
16. ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి)
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ…
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పము తో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (ఎడమ నుండి కుడి వైపుకు ) తిప్పాలి.
అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి) అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
దిగువ మంత్రము లతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు – బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో) చూపవలెను.
ఓం ప్రాణాయ స్వాహా– ఓం అపానాయ స్వాహా — ఓం వ్యానాయ స్వాహా — ఓం ఉదానాయ స్వాహా — ఓం సమానాయ స్వాహా –ఓం పరబ్రహ్మణే నమః — అంటూ నివేదించవలెను.
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- తాంబూలం సమర్పయామి – తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను)
శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు || శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి అంటూ పూజ చేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి.
మరలా ఆచమానం చేసి పైన చెప్పుకొన్న విధంగానే మరలా సంకల్పం చెప్పుకోవాలి.
శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ:
విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి
ఓం ఆంహ్రీంక్రోం యంరంలంవం శంషంసంహం – ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా (నమస్కారం చేస్తూ) ||ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు||
అవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)
షోడశోపచార పూజ:
ధ్యానం:
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్ ||
శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి||
వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి
ఆవాహనమ:
అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ.
ఆవాహయామి|| అని మరల అక్షతలు వేయాలి
సింహాసనం:
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఆసనం సమర్పయామి || అక్షతలు లేదా పూలు వేయాలి
అర్ఘ్యం:
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్
అర్ఘ్యం సమర్పయామి||ఉద్ధరెణతో నీరును స్వామికి చూపించి పక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి
పాద్యం:
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
పాద్యం సమర్పయామి|| మరలా కొంచె నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి
ఆచమనీయం:
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో
ఆచమనీయం సమర్పయామి|| కొంచె నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి
మధుపర్కం:
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
మధుపర్కం సమర్పయామి|| స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.
పంచామృత స్నానం :
పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
పంచామృత స్నానం సమర్పయామి|| ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి
శుద్ధోదక స్నానం:
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః
స్నానం కురుష్వభగవన్వుమాపుత్ర నమోస్తుతే
శుద్ధోదక స్నానం సమర్పయామి||కొంచెం నీటిని స్వామిపై చల్లాలి
వస్త్రయుగ్మం:
రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి|| స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్లయితే పత్తికి పసుపు, కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు
ఉపవీతం:
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్
గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
ఉపవీతం సమర్పయామి|| యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి
గంధం:
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
గంధం సమర్పయామి|| కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి
అక్షతలు:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్
శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
అక్షతాన్ సమర్పయామి|| స్వామికి అక్షతలు సమర్పించాలి
పుష్పములు:
సుగన్ధాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ
యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే
పుష్పాణి పూజయామి|| స్వామిని పూలతో పూజించాలి
అధాంగపూజ:
కింది నామాలను చదువుతూ పుష్పములతో స్వామి వారిని పూజించవలెను.
గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి
అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి
హేరంబాయ నమః – కటిం పూజయామి
లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
గణనాథాయ నమః – నాభిం పూజయామి
గణేశాయ నమః – హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి
ఏకవింశతి పత్రపూజ:
21 విధముల పత్రములను ఒక్కొక్క నామం చదువుతూ పక్కన సూచించిన విధంగా పత్రాలు తీసుకుని స్వామిని పూజింపవలెను.
ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగి)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణు)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంతం)
ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (గండకీ)
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతపత్రాణి పూజయామి.
శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా:
ఈ క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
ధూపం:
దశాంగం గుగ్గు లోపేతం సుగన్ధిం సుమనోహరమ్ |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ || ధూపమాఘ్రపయామి||
అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన వున్న స్టాండులో లేదా అరటి పండుకు గుచ్చాలి.
దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపం దర్శయామి|| దీపాన్ని స్వామికి చూపించాలి
నైవేద్యం
కొబ్బరి కాయలు ఇంకా వుంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన బ్బరికాయను, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి.
సుగంధాన్ సుకృతాం శ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గ్యైః ప్రకల్పితాన్
భక్ష్యం, భోజ్యంచ లేహ్యం చ చోష్యం పానీయ మేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక- మహానైవేద్యం సమర్పయామి||అంటూ ఆకుతో ఆ పదార్ధారన్నింటిపైన కొద్దిగా నీరు చల్లాలి. ఆ తరువాత స్వామికి నైవైద్యం పెట్టాలి.
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్ |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
తాంబూలం సమర్పయామి. తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు వుంచి నమస్కరించాలి.
నీరాజనం
సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ,
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి||
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి|| కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి, ఆ తరువాత హారతి పాత్రపై కొంచె నీటిని వుంచి కళ్ళకు అద్దుకోవాలి
మంత్రపుష్పం
పుష్పం, అక్షతలు తీసుకొని నిలుచొని ఈ శ్లోకాన్ని పఠించాలి
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండః మహాకాయ కోటిశూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా
అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి
ప్రదక్షిణ:
యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ|
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే ||
పాపో హం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః |
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప ||
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ||
ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం
తరువాత మరలా కూర్చొని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచె నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి.
యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవన్దే తమచ్యుతమ్!!
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే!!
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి. ఆ నీటిని, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి. పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై వుంచాలి. పెద్దలు కూడా ఆ అక్షతలు శిరసుపై ధరించాలి.
నమస్కారము, ప్రార్థన:
"ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన... ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి" అని చెబుతూ ప్రదక్షిణం చేయాలి.
"అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన... పునరర్ఘ్యం సమర్పయామి"
అని చెబుతూ మోయారోసారి నీటిని భగవంతుని పాదాల క్రింద నదలాలి.
"ఓం బ్రహ్మవినాయకాయ నమః నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి పరత్రచ పరాంగతిమ్.
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా."
శ్రీ వినాయక చరిత్ర
గమనిక: వినాయక కథను చదివేవారు మరియు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.
గణపతి జననం:
గజముఖుడయిన అసురుడొకడు అతని తపస్సుచే శంకరుడిని మెప్పించాడు. శంకరుడు ప్రత్యక్షం కాగా కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ నధించ జాలని శక్తిని ఇవ్వమని మరియు శివుడు తన ఉదరము నందే నివసించవలెనని కోరినాడు. ఆ విధంగా శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. ఈ విషయాన్ని కైలాసంలో ఉన్న పార్వతీ దేవికి తెలియగా భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీ దేవి విలపించింది. జగత్తుకు శంకరుడు లేని స్థితి ఏర్పడింది. జగన్మాత అయిన పార్వతీ దేవి భర్తను విడిపించు ఉపాయము కొరకు మహా విష్ణువును అర్థించినది.
మహా విష్ణువు గంగిరెద్దు వాని వలే వేషము ధరించినాడు. నందీశ్వరుడిని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళి గజముఖాసురుడిని మెప్పించినాడు. గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అని అన్నాడు. మహా విష్ణువు యొక్క వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుడిని ఈ నందీశ్వరుని వశము చేయమని అన్నాడు.
గజముఖాసురునికి శ్రీహరి వ్యూహము అర్ధమైనది. తనకు అంత్య కాలము దాపురించినదని గుర్తించి, కుక్షియందు ఉన్న శివుడిని ఉద్దేశించి గజముఖుడు ఇలా అన్నాడు. "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది' అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు.
నందీశ్వరుడు ఉదరమును దీన్చి శివునికి అందునుండి విముక్తిని కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరస్సును, చర్మమును తీసుకొని స్వస్థలానికి చేరాడు. అక్కడ పార్వతీ దేవి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది.
తనలో తాను ఉల్లనిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో ఆమె కొరకు ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయవలెనని దేవికి అనిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి అయిన పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది. ఆ దివ్యసుందర బాలుడిని వాకిట కాపలాకు ఉంచి, తన పనులకై లోనికి వెళ్ళింది.
శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతర మందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! అని శివుడు ఆగ్రహించి ఆ బాలుడిని త్రిశూలంతో శిరచ్ఛేదము చేసి లోనికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతీ దేవి విలపించింది. జరిగిన విషయమును పార్వతీ దేవి చెప్పగా శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరస్సును ఆ బాలుని మొండెమునకు అతికించి ప్రాణం పోసినాడు. అలా గజముఖుడి యొక్క శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులపట్టి అయినాడు. విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వత స్థానమును పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
గణేశుడు అగ్రపూజనీయుడు:
గణేశుడు అగ్రపూజనీయుడు అనే స్థానాన్ని ఎలా పొందాడు? శివుని యొక్క రెండవ కుమారుడైన కుమారస్వామి అగ్రపూజనీయుడు అన్న స్థానమును కోరినాడు. అప్పుడు శివుడు తన కుమారులు ఇద్దరికీ పోటీ పెట్టినాడు. "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికే ఈ ఆధిపత్యము లభిస్తుందని అన్నాడు. కుమారస్వామి వేగముగా ఎంతో సులువుగా తన వాహనమైన నెమలిపై కూర్చొని వెళ్ళాడు. గజాననుడు ఆలోచిస్తూ మిగిలిపోయినాడు. అతని వాహనము మూషికము. అందుపై కూర్చొని ప్రయాణించలేడు. ముల్లోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమును అర్థించినాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, బిలమునిచ్చు నారాయణుని ఆధీనాలు. ఆ మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్ధస్నానమందును కుమార స్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కావొచ్చాడు. అలా ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానం చేసి వినాయకుడు శివుని వద్దకు కుమార స్వామి కంటే ముందే చేరుకున్నాడు. వినాయకునికే ఆధిపత్యము లభించినది.
చంద్ర దర్శనం నీలాపనింద: (శ్యమంతకమణ్యుపాఖ్యానము)
అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ అవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడు ఈ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము తొలగిపోయినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ నుండి విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకొని నగరమునకు వెళ్ళి ప్రజలను పిలిచి జరిగిన యదార్ధమును వివరించి విందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని మరియు తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల ఆ నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతక మణి గాథను వినుట సాంప్రదాయమయినది.
పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు:
"సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః"
సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు ఈ శ్యమంతకము నీదే అను అర్ధము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.
ఉద్వాసన మంత్రం:
"యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకంమహిమా నస్సచంతే యాత్ర పూర్వేసాధ్యాస్పంతిదేవా!!"
సర్వేజనా సుఖినో భవంతు.
వినాయక చవితి పూజ సమాప్తం!
గణపతిని ఆరాధించినటువంటి వారికి అన్ని అడ్డులు తొలిగి విజయం ప్రాప్తిస్తుంది.
శ్రీ మహా గణాధిపతయే నమః
ఓం గం గణపతయే నమః
నీరాజనం…
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తతే |
వినాయక చవితి పద్యములు
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
- జయమంగళం నిత్య శుభమంగళం.
గణపతిని నమ్మకంతో ప్రార్థిస్తే కష్టాలన్నీ దూరం.. వినాయకుడిని పూజిస్తే కలిగే 8 ప్రయోజనాలివే..
వినాయక చవితి..భారత దేశంలో హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. శివపార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతియేటా భాద్రపద మాసం శుక్ల చతుర్థినాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగనే వినాయక చతుర్థి, గణేశ చతుర్థి అని కూడా పిలుస్తారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు గణేశ విగ్రహాలు ప్రత్యేక పూజలు అందుకుని.. ఆ తర్వాత నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరుతాయి. విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో కోలాహలంగా నిర్వహిస్తారు.
గ్రామాలు, నగరాల్లోని బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో అందరూ కలిసి వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యోద్యమంలో ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించడంలో వినాయక చవితి మహోత్సవాలు కూడా కీలక పాత్ర పోషించారు. 1892లో దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించేందుకు స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్.. గణపతి ఉత్సవాలను ప్రారంభించారు.
వినాయకుడు హిందూ మతంలో ఎక్కువగా పూజించే దేవుళ్లలో ఒకరు. ఆయన్ను విఘ్నహర్త అని కూడా అంటారు. అంటే, అడ్డంకులను తొలగించేవాడు అని అర్థం. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజిస్తారు. ఆయన్ని ప్రార్థిస్తే అత్యంత శక్తిమంతమైన ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.
వినాయకుడిని పూజించడం వల్ల కలిగే 8 లాభాలు ఇక్కడ చూడండి:
గణపతిని జ్ఞానానికి, శ్రేయస్సుకు, విఘ్నాలను తొలగించే దేవుడిగా కొలుస్తారు. నవరాత్రులలో ఆయనను పూజిస్తే జీవితంలోని అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. సంపద, అదృష్టం కలుగుతాయి. ఈ తొమ్మిది రోజులు గణపతిని పూజించడం వల్ల విజ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా లభిస్తాయి.
శ్రేయస్సు: ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, శ్రేయస్సుతో కూడిన జీవితాన్ని కోరుకుంటారు. వినాయకుడిని ప్రార్థించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేస్తారు. మీ లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పం పెరుగుతుంది.
అదృష్టం: వినాయకుడు భక్తులకు మంచి అదృష్టం, సంపదలను అనుగ్రహిస్తాడని చెబుతారు. మీరు పూర్తి అంకితభావంతో పూజిస్తే, మీకు కచ్చితంగా అదృష్టం లభిస్తుంది. సంపద, శక్తిని సాధించే మార్గం సులభం అవుతుంది.
జ్ఞానం: గణపతి ఏనుగు తల జ్ఞానానికి ప్రతీక. అందుకే, ఆయనను పూజిస్తే జ్ఞానం లభిస్తుంది. మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అవసరం.
అడ్డంకుల తొలగింపు: వినాయకుడిని విఘ్నహర్త అని పిలుస్తారు. పూర్తి విశ్వాసంతో పూజిస్తే, సరైన మార్గంలో నడవడానికి మార్గనిర్దేశం చేస్తాడు. మీ భయాలను జయించి, అన్ని అడ్డంకులను అధిగమించే ధైర్యాన్ని ఇస్తాడు.
ఓర్పు: గణేశుడి పెద్ద చెవులు ఓర్పుగా వినే లక్షణాన్ని సూచిస్తాయి. ఆయనను ప్రార్థించి, మీ అంతర్గత శక్తిపై దృష్టి పెడితే, మీరు కూడా అదే స్థాయి ఓర్పును అలవర్చుకుంటారు.
విజ్ఞానం: వినాయకుడిని పూజించినప్పుడు, మీరు పరివర్తన మార్గంలో నడవడం ప్రారంభిస్తారు. పట్టుదలతో ప్రయత్నిస్తే, మీరు విజ్ఞాన సోపానాలను అధిరోహిస్తారు.
ఆత్మ శుద్ధి: ఎవరైతే అంకితభావంతో ఆయనను పూజిస్తారో, వారి ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు. క్రమంగా మీ జీవితం నుంచి ప్రతికూలత తొలగిపోయి, మీ ఆత్మ పరిశుభ్రమవుతుంది.
శాంతియుత జీవితం: గణేషుడిని పూజించడం ద్వారా, మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి బాధ్యతగా పనిచేయడం మొదలుపెడతారు. దీనివల్ల మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం శాంతియుతంగా మారుతుంది.