మహ్మద్ ప్రవక్త జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు... పరిశీలించిన సీతంరాజు సుధాకర్




కడలి న్యూస్, విశాఖపట్నం:–
ఈ నెల 5న జరగనున్న జెషన్ ఎ మీలాద్ ఉన్ నబీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరు కానున్నారు. మహమ్మద్ ప్రవక్త 1500వ జయంతి సందర్బంగా వన్ టౌన్ సెంట్ ఆలోసిస్ స్కూల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎన్ టి ఆర్ వైద్య సేవ చైర్మన్, దక్షిణ నియోజకవర్గం ఇంచార్జి సీతరాజు సుధాకర్ పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహణకు అన్ని విధాల సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా సీతం సుధాకర్ తెలియజేశారు. కార్యక్రమం జరగనున్న గ్రౌండ్స్ ని పరిశీలించిన ఆయన  కమిటీ సభ్యులతో చాలాసేపు తనతో ముస్లిం కుటుంబలతో ఉన్న అలనాటి మధుర క్షణాలు  అందరు కలసి మెలసి రంజాన్, బక్రీద్, మరియు ముఖ్యంగా పీర్లా పండగ నాడు జరిగే అగ్ని గుండం తొక్కడం వంటివి  తీపి జ్ఞపకాలు ముచ్చటించారు. అందుకు కమీటి  సభ్యులు మునీర్, షబ్బీర్, రఫీ, జిలాని, అతనికి కుల మతలతో సంభందం లేని గొప్ప నాయకుడని శంభోదించారు. అందుకు హర్షిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టిన తనువంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కామెంట్‌లు
Popular posts