టీడీపీ ప్రభుత్వంలోనే దేవాలయాల అభివృద్ధి :ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు


కడలి న్యూస్, విశాఖపట్నం :– 
టీడీపీ రాష్ట్ర ప్రభుత్వలోనేదేవాలయాల అభివృద్ధి జరుగుతుందని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. నగరంలోని పెదవాల్తేరు లాసన్స్ బే కాలనిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తమ కూటమి ప్రభుత్వం దేవాలయాల్లో భక్తుల సదుపాయాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో క్రొత్తగా నియమితులైన ధర్మకర్తల మండలి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చోడె వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ క్రొత్తగా ధర్మ కర్తల మండలిలో నియమించబడిన వారంతా మంచి సేవాభావంతో ఉన్న వారేనని, వారు ఇంకా మరింత సమర్ధ వంతంగా పనిచేసి దేవస్థానాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. చైర్మన్ గా  ప్రమాణస్వీకారం చేసిన బైరెడ్డి గోవిందరెడ్డి మాట్లాడుతూ దైవ సేవ చేయడానికి తనకు పార్టీ కల్పించిన మంచి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని మంచి పేరు తెచ్చుకుంటానని పేర్కొన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా అలజంగి ఈశ్వరరావు, నానాజీ, చిల్లకాట మణి, జగన్నాధ పద్మావతి, దశరథ రామయ్య, గొర్లె సుందరి దేముడు బాబు, జలగడుగుల రాధిక ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైరెడ్డి పోతన రెడ్డి, బొట్ట రమణ, కాళ్ళ శంకర్, పీతల అమరేంద్ర, చిన్నపిల్లి ఆనంద రెడ్డి, చిన్నపిల్లి నరేంద్ర రెడ్డి, తారక్, గోపి, గొలగాని పోలారావు, తెడ్డు రాజు, కంభాపు శివారెడ్డి, దేవస్థానం ఈఓ ఆదినారాయణ, అర్చకులు బోగారపు సూర్యనారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు
Popular posts