ఈ నెల 5న సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన... ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్




కడలి న్యూస్, విశాఖప‌ట్ట‌ణం:– 
రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5న  ట్రైలీగ‌ల్, ఏసీఐఏఎం (Asian Centre for International Arbitration and Mediation), ఎన్.ఎల్.ఐ.యు.(National Law Institute University) భోపాల్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో రాడిష‌న్ బ్లూ రిసార్ట్ లో నిర్వహిస్తున్న నేష‌న‌ల్ మీడియేషన్ కాన్ఫ‌రెన్స్ లో పాల్గొనేందుకు విచ్చేస్తున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీతో క‌లిసి ప‌రిశీలించారు. ముఖ్య‌మంత్రి ఆ రోజు ఉద‌యం తాడేప‌ల్లి నుంచి నేరుగా రుషికొండ హెలీప్యాడ్ వ‌ద్ద‌కు చేరుకోనున్నందున ఆ మేర‌కు బుధ‌వారం సాయంత్రం రుషికొండ హెలీప్యాడ్ ను సంద‌ర్శించి అక్క‌డ‌ ప‌రిస్థితిని ఇరువురూ స‌మీక్షించారు. అనంత‌రం రాడిష‌న్ బ్లూ రిసార్ట్ కు చేరుకొని అక్క‌డ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. సీఎంతో పాటు సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ పి.ఎస్. న‌ర‌సింహ‌, జ‌స్టిస్ సూర్య‌కాంత్, రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధీర‌జ్ సింగ్ ఠాకూర్, ఇత‌ర న్యాయ‌కోవిదులు కాన్ఫ‌రెన్స్ లో భాగ‌స్వామ్యం కానున్న నేప‌థ్యంలో భ‌ద్ర‌తాప‌ర‌మైన ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. సంబంధిత అధికారుల‌కు, నిర్వాహ‌కుల‌కు త‌గిన విధంగా సూచ‌న‌లు చేశారు. అయితే ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న అధికారికంగా ఖ‌రారు కావాల్సి ఉంది. ప‌ర్య‌ట‌న‌లో డీసీపీలు అజిత‌, మేరీ ప్ర‌శాంతి, పోలీసు అధికారులు ల‌తామాధురి, శ్రీ‌నివాస‌రావు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఏసీపీ న‌ర్శింహ‌మూర్తి, ఐ&పీఆర్ డీడీ కె. స‌దారావు, స్థానిక త‌హ‌శీల్దార్ పాల్ కిరణ్, సీఐలు, ఎస్సైలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
Popular posts