కడలి న్యూస్, గాజువాక:– స్థానిక జగ్గు జంక్షన్ లో “స్త్రీ శక్తి – సూపర్ సిక్స్, సూపర్ హిట్” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ముఖ్యమంత్రిగా ఆయన చూపిన దూరదృష్టి, అంకితభావం, అభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సంపాదించాయని అన్నారు. 30 ఏళ్లలో చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి మహిళల ఆర్ధిక ప్రగతికి బాటలు వేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే, మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తుల హక్కులు కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు పునాది వేశారు. అలానే రెండు రూపాయల కిలో బియ్యం వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేసి, పేదల జీవితాల్లో వెలుగు నింపారు. అదే దారిలో, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “స్త్రీ శక్తి” పథకం ద్వారా మహిళల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నారు. ఉచిత బస్సు సదుపాయం వల్ల లక్షలాది ఆడబిడ్డలు, మహిళలు, చిన్న వ్యాపారస్తులు, కూలీలు ప్రయోజనం పొందుతున్నారు. ఆడబిడ్డకు విద్య, ఉపాధి, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం ద్వారానే నిజమైన సమాజ పురోగతి సాధ్యమని ఆయన చూపించారు. 90లలో ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ అనేది ఒక లగ్జరీగా ఉన్నప్పుడు, మహిళలు పొయ్యిల పొగతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తించి “దీపం” పథకం ద్వారా పది లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి చరిత్ర సృష్టించారు. అదే నేడు “దీపం–2” రూపంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే స్థాయికి వచ్చింది. ఎన్‌టీఆర్ చూపిన మార్గంలోనే, చంద్రబాబు మహిళా సాధికారత కోసం, కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసం, సామాజిక న్యాయం కోసం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. మహిళలు ఎక్కడైనా భద్రంగా, గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. వితంతువులకు పెన్షన్లు, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రతి తల్లిని గౌరవించే కార్యక్రమాలు, ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేకమైన సంక్షేమ చర్యలు చేపడుతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడిన అంగన్‌వాడీలకు ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని వారి జీతాలు రూ.4,200 నుండి రూ.10,500కు పెంచారని, హెల్పర్ల జీతాలు కూడా పెంచారని చెప్పారు. అంతేకాకుండా గ్రాడ్యుటీని అమలు చేయడం, ఫోన్లలో పనిభారాన్ని తగ్గించి కొత్త ఫోన్‌లు ఇవ్వడం వంటి చర్యలు కూడా చేపడుతున్నారని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించి విద్యలో సమాన అవకాశాలు కల్పించడం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మహిళల సంక్షేమంపై చూపుతున్న అంకితభావానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న గౌరవం, కట్టుబాటు ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
సి.ఎం గా చంద్రబాబు 30ఏళ్ల ప్రస్తానం.. మహిళా సాధికారత, సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం - టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా