పెందుర్తిలో జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన




కడలి న్యూస్, విశాఖపట్నం:– జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు నియోజవర్గం శాసనసభ సభ్యులు  పంచకర్ల రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. పెందుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు  కల్పించడమే ధ్యేయంగా ఈ  మెగా జాబ్ మేళా నిర్వహించారు. పెందుర్తి పీఎం శ్రీ హై స్కూల్ లో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్  పీలా శ్రీనివాసరావు, హోం మంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జి పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ మెగా జాబ్ మేళ లో సుమారు 5000 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. సుమారు 50 కంపెనీలు ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు అర్హతలు సాధించిన నిరుద్యోగులకు అతిధుల చేతి మీదగా నియామక పత్రాలు అందజేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అతిధులు చేతి మీదగా సన్మానించి, సత్కరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని ఈ మెగా జాబ్ మేళా నిర్వహించినందుకు  పంచకర్ల రమేష్ బాబును అభినందించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయ సహకారాలతో పెందుర్తి నియోజకవర్గం లో జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని దానికి ముఖ్యఅతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందని గత ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగులు ఉద్యోగాలు లేక నిరీక్షిస్తున్న సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామని ముందుకు రావడం శుభ పరిణామంగా భావించాలన్నారు. విద్యా ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఐదు సంవత్సరాలు లోపు దానికి అనుగుణంగా టిసిఎస్ కి, గూగుల్ కి ల్యాండ్ ఇవ్వడం జరిగిందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించిందని ఆమె అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ స్కిల్ మెగా జాబ్ మేళా ను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చక్కగా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నందుకు అభినందనీయమని తెలిపారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతకు నిరుద్యోగ అవకాశాలు కల్పించాలని ధ్యేయం గా ప్రభుత్వం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ యువతకు పలు పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి భవిష్యత్తుకు పునాది వేసుకునే అవకాశం ఉంటుందని మా జనసేన ఎమ్మెల్యేలకు ఎప్పుడు సూచిస్తుంటారని.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవి దృష్టిలో ఉంచుకొని జాబ్ మేళాకు వచ్చే యువతీ యువకులకు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు సత్కరించుకోవడం జరిగిందని తెలియజేశారు, ఈ మెగా జాబ్ మేళా మన పెందుర్తి మండలంలో ఏర్పాటు చేసుకోరు జరిగిందని 50 కంపెనీ ప్రతినిధులు పాల్గొని సుమారు 5000 మంది పాల్గొని నిరుద్యోగులను ఎంట్రీలు చేసి అరాతలు సాధించిన 3000 పైగా నిరుద్యోగులకు కంపెనీల నియామక పత్రాలు గౌరవ శాసనసభ్యులు చేతుల మీదు   గా అందించడం జరిగిందని నిరుద్యోగాలకు ఉద్యోగ కల్పించిన  కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో పెందుర్తి మండల రెవెన్యూ ఆఫీసర్ ఆనంద్, జీవీఎంసీ జోన్ సిక్స్ జోనల్ కమిషనర్ , జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి, విశాఖపట్నం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చాముండేశ్వరరావు, అనకాపల్లి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గోవింద్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సుబ్బి రెడ్డి,97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు వివిధ కంపెనీలకు సంబంధించిన విద్యార్థి డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు