మహమ్మదీయ మస్జిద్ ఆవరణలో ఎమ్మెల్యే వెలగపూడి తనయుని పుట్టినరోజు వేడుకలు


కడలి న్యూస్, విశాఖపట్నం:-
విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కుమారుడు వెలగపూడి ప్రతాప్ రుద్ర  జన్మదినం సందర్భంగా మహమ్మదీయ మస్జిద్ యూత్ ఆధ్వర్యంలో గౌసేపాక్ నిషానీ వద్ద  కేక్ కటింగ్ నిర్వహించి పేదలకు చీరలు పంపిణీ చేసారు. అంతకుముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వెలగపూడి ప్రతాప్ రుద్రను  సాదరంగా స్వాగతించారు. అనంతరం మదర్సా విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్స్, పుస్తకాలు, పెన్ పెన్సిల్స్ అందరికి అందజేసారు. ఈ  కార్యక్రమం లో వార్డు ప్రెసిడెంట్ పీతల అమరేంద్ర, వారి కుమారుడు పీతల అవినాష్ యాదవ్ (యాదవాస్ లీడర్)లు పాల్గొని ఈ జన్మదిన వేడుకల్లో ముస్లిం పెద్దలు, యూత్ కమిటీ సభ్యులు పాల్కొన్నారు.

కామెంట్‌లు