కడలి న్యూస్, సింహాచలం:– దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఎన్. సుజాత ఆదివారం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం ఇ ఓ(ఎఫ్ఎ సి)గా బాధ్యతలు చేపట్టారు. సింహాచలం దేవస్థానం ఈవోగా నియమితులైన సుజాత మొదటిగా అప్పన్న స్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కాన ఆనంద్ కుమార్ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు సాదర స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనము తదుపరి బేడా ప్రదక్షణ చేయించి స్వామి వారి దర్శనము అనంతరము వేద పండితులు వేద ఆశీర్వచనము ఇచ్చారు. అనంతరము స్వామివారి పటము ప్రసాదాలను ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ అందించారు. వీరితో వైదిక సిబ్బంది ఆలయ పర్యవేక్షకులు జి వి ఎస్ కే ప్రసాద్, కంచి మూర్తి తదితరులు పాల్గొన్నారు
సింహాచలం దేవస్థానం ఈఓగా ఎన్.సుజాత బాధ్యతలు స్వీకరణ