కడలి న్యూస్, విశాఖపట్నం:– జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (skill development corporation) సహకారంతో తేదీ 09-05-2025 శుక్రవారం ఉదయం 9-00 గంటలకు పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జివిఎంసి 96వ వార్డు పెందుర్తి కాలేజ్ పియం శ్రీ గవర్నమెంట్ హైస్కూల్ నందు దాదాపు 40 పైగా కంపెనీలతో 2500 పైగా ఉద్యోగాలు కల్పించడం కొరకు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతు న్నది కావున పెందుర్తి నియోజకవర్గం నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయుచున్నాము ఈ మెగా జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపె నీలు పాల్గొనచున్నారు వాటి ద్వారా నియోజవర్గంలో నిరుద్యోగ యువతి యువకులకు ఇంటర్వూలు నిర్వహిం చడం జరుగుచున్నది మెగా జాబ్ మేళా కు హాజరు అయ్యే నిరుద్యోగ యువతీ, యువకులు పదవ తరగతి/ ఇంటర్/ఐ.టి. ఐ/ డిప్లొమా/బి.ఫార్మసీ/ M. ఫార్మసీ, నర్సింగ్ /డిగ్రీ /బి.టెక్/పి.జి, విద్యార్హతలు కలిగిన వారు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వారు ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు.. ఖచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్, ఆధార్ కార్డ్,రెండు ఫోటోలతో హాజరుకావాలని సూచించడం జరిగినది.
జాబ్ మేళా నిర్వహించు ప్రదేశం
పీఎం శ్రీ గవర్నమెంట్ హైస్కూల్ జూని యర్ కాలేజ్ దగ్గర పెందుర్తి విశాఖ పట్నం
తేదీ మరియు సమయం
09.05.2025 తేదీన ఉదయం 9 గంటల నుండి
వివరముల కొరకు
8712655686, 8790118349, 8790117279, 8555868681, 9966965502 5 3 సంప్రదించాలని ఆసక్తి కలిగిన అభ్యర్థు లు తమ వివరములను https://naipunyam. ap.gov.in/user-registration లో నమోదు చేసుకోవలసింది గా కోరుకుంటున్నాము అని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.