షరీఫ్ ను సత్కరించిన విశాఖ ముస్లిం టిడిపి నాయకులు


కడలి న్యూస్ విశాఖపట్నం:–
రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారులు ఎంఎ. షరీఫ్ ను విశాఖపట్నం గవర్నర్ బంగ్లాలో తెలుగుదేశం పార్టీ విశాఖ ముస్లిం మైనారిటీ నాయకులు  మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.   ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు షరీఫ్ కు ముస్లింల సమస్యల కోసం వివరించడం జరిగింది. అలాగే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు వివిధ నామినేట్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ చిన్న రెహమాన్, మైనారిటీ స్టేట్ కమిటీ మహమ్మద్ జఫ్రిల్లా, అబ్దుల్ అనీఫ్, విశాఖ పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు షేక్ రహమతుల్లా, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, షేక్ ఖలేశా, మహమ్మద్ రహమతుల్లా, షేక్ యాసిన్, షేక్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు