సమగ్రమైన హెచ్ఐవి సంరక్షణ, చికిత్స' అనే అంశంపై శిక్షణా శిబిరం


కడలి న్యూస్, విశాఖపట్నం:–
 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ కు, ప్రైవేట్ ఆరోగ్య సంస్థల నిర్వాహకులకు "సమగ్రమైన హెచ్.ఐ.వి సంరక్షణ, చికిత్స' అనే అంశం మీద శిక్షణా కార్యక్రమాన్ని   సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనము, ప్రభుత్వ మానసిక వైద్యశాల  సమావేశ ప్రాంగణంలో నిర్వహించడం జరిగినది. హెచ్ఐవి యాక్ట్, హెచ్ఐవి మందులు, హెచ్ఐవి చికిత్స  మొదలగు అంశాల పైన  ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు డా. చక్రవర్తి, డిప్యూటీ డైరెక్టర్, ఎపిఎస్ఎసిఎస్ వారు విపులంగా సమాధానాలు ఇవ్వడం జరిగినది. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి  ఎపిఎస్ఎసిఎస్ సంస్థ ప్రతినిధులు  జ్ఞాపికను బాహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్ ఐ. వాణి, మెడికల్ సూపర్ండెండెంట్ కే.జీ.హెచ్, డాక్టర్ మురళీమోహన్ ఐ.ఎం.ఏ సెక్రటరీ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, పెప్ ఫర్,  డాక్టర్ ఉమా సుందరి రిటైర్డ్ ఆర్డీఓ,   డాక్టర్ చక్రవర్తి, డి. డి, ఎపిఎస్ఎసిఎస్, డాక్టర్ ఆర్.రమేష్ డి.ఎల్.ఎ.టి.ఓ, షేర్ ఇండియా సంస్థ నుండి డాక్టర్ ప్రభు,  నాగార్జున, రమేష్, పద్మ,, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఉమా మహేశ్వరరావు, డా. పట్నాయక్, డా. సురేంద్ర, డా. శ్రీనివాస్, ఎ ఆర్ టి , ఒ ఎస్ టి సిబ్బంది పాల్గొన్నారు. 

జారీ: డాక్టర్ రమేష్, జిల్లా కుష్టు వ్యాధి, ఎయిడ్స్, టిబి అధికారి, విశాఖపట్నం.


కామెంట్‌లు