వేద పాఠశాలల్లో ప్రవేశాలు ప్రారంభం

 


 కడలి న్యూస్,  విశాఖపట్నం:– శ్రీ కాంచీ కామకోటి పీఠం ఆధ్వర్యంలో, శ్రీ ప్రత్యక్ష చారిటబుల్ ట్రస్ట్, చెన్నై నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ వేదం, స్మార్ట్ పాఠశాలల్లో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ద్వారకానగర్‌లోని శంకరమఠంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశంలో శ్రీ కాంచీ కామకోటి పీఠానికి చెందిన మాంధాత లక్ష్మి, శంకరమఠం అధ్యక్షులు డా. టి. రవి రాజు మాట్లాడారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం, సంరక్షించడం మరియు ప్రచారం చేయడమే ట్రస్ట్, పీఠం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆలయ సంప్రదాయాలను కొనసాగించేందుకు వేద, స్మార్త పండితులు, ఆదర్శ గృహిణులు, నాదస్వర విద్వాంసులు, ప్రవచనకర్తలు, ఆలయ సంగీతకారులు మరియు నైవేద్య తయారీలో నిపుణులైన వంటవాళ్లను తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశమన్నారు. బ్రాహ్మణ బాలికల కోసం సాంప్రదాయ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, హైదరాబాద్, తిరువణ్ణామలై, సిందనూర్, తుమ్కూర్, చెన్నైలోని ఓరగడంలో ఈ కేంద్రాలు ఉన్నాయి.

కోర్సులు: ఇంటర్మీడియట్ (ఎంపీసీ, బైపిసి, ఎం ఇ సి, సిఇసి) ప్రకాశాస్త్రి, బీఏ, బీకాం, బీఏ సంస్కృతం, బీబీఏ, బీఎస్సీ మ్యాథ్స్, బాల్‌ఎల్‌బీ, బీఏ మ్యూజిక్ మరియు ఈ విద్యా సంవత్సరం నుంచి బీఏ ఫుడ్ అండ్ న్యూట్రిషన్.

బ్రాహ్మణ బాలుర కోసం ఇంగ్లీష్ విద్యతో కూడిన ఇంటిగ్రేటెడ్ వేద స్మార్త పాఠశాలలు, ఫుల్‌టైమ్ వేద పాఠశాలలు, గురుకులాలు, సంస్కృత స్మార్త పాఠశాలలు, రామాయణం, సంగీతం మరియు భాగవతం పాఠశాలలు ఉన్నాయి.

సముదాయాల వారీ పాఠశాలలు (ఇంగ్లీష్ విద్యతో):

నాయీబ్రాహ్మణులకు – నాదస్వర పాఠశాల

కుమ్మరి సముదాయానికి – కుంభకార (ప్రజాపతి) పాఠశాల

యాదవ బాలురకు – భారతీయ గౌ విజ్ఞాన పాఠశాల

విశ్వకర్మ సముదాయానికి – తక్ష పాఠశాల

ప్రవేశాలు పీఠం మార్గదర్శకాలు, సముదాయ నియమాలు, ప్రభుత్వ ధృవపత్రాల ఆధారంగా మాత్రమే జరుగుతాయి. ఆధార్ చిరునామా, సీట్ల లభ్యతను బట్టి కేంద్రాల కేటాయింపు జరుగుతుంది.

వివరాలకు: లక్ష్మి మందాథ – 9500195021, స్వర్ణ – 8217563887

వెబ్‌సైట్లు: www.sampradaya.org, www.kanchiintegratedpatasalas.com (Admissions పై క్లిక్ చేయండి)!

కామెంట్‌లు