జీవవైవిధ్య పరిరక్షణ కోసం గ్రీన్ సోల్జర్స్ కృషి అవసరం - ప్రతి విద్యార్థి గ్రీన్ సోల్జర్ కావాలి


- అడవుల పరిరక్షణ మానవాళి బాధ్యత

- ఏ జీవి అంతరించిన నష్టం మానవాళి కే

- జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం

 కడలి న్యూస్, విశాఖపట్నం:–  జీవవైవిద్య పరిరక్షణ కోసం గ్రీన్ సోల్జర్స్ కృషి అవసరం అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం జిల్లా ఎంవిపి కాలనీలోని సమత డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ సరాబంది అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ జీవవైవిధ్య పరిరక్షణ కోసం విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అందరూ హరిత సైనికులు గా (గ్రీన్ సోల్జర్స్) గా మారి అడవులు పరిరక్షణకు, సమస్త జీవుల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అడవుల పరిరక్షణ మానవాళి బాధ్యత అన్నారు. ఏ జీవి అంతరించిన నష్టం మానవాళి కే అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సరాబంది మాట్లాడుతూ పర్యావరణ, జీవావరణ పరిరక్షణ కోసం నిరంతరం తమ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, మనం జీవిస్తున్న ఈ భూగోళం, సమస్త జీవరాశి ఆరోగ్యంగా ఉండాలంటే మానవాళి కృషి చాలా అవసరం అన్నారు. ఏ జీవి అంతరించినా మానవాళికి మనుగడే నష్టం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శిల్ప, లెక్చరర్ డాక్టర్ శ్రీదేవి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ బి రాజేష్ కుమార్, రామకృష్ణ, గ్రీన్ వాలంటీర్ జె రాజేశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌లు