260 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్
కొచ్చిన్ షిప్ర్యిర్డ్ లిమిటెడ్ (CSL)లో 260 వర్క్ మెన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(FEB 7) ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ITI, NTCతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు). నెలకు రూ.23,300 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: cochinshipyard.in
AIIMS గోరఖ్ పూర్ లో ఉద్యోగాలు
AIIMS గోరఖ్పూర్ 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(జియోగ్రఫీ, బయో స్టాటిస్టిక్స్, డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్), PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్:https://aiimsgorakhpur.edu.in
ICAR-IARIS ఉద్యోగాలు
ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI) 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు దరఖాస్తును ఈ-మెయిల్ dk6473@gmail.com FEB 28 2 సెండ్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MTech/ME/MCA/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్:https://www.iari.res.in/
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పోస్టులు
ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD, MSc(ప్లాంట్ పాథాలజీ/వైరాలజీ/మాలిక్యులార్ బయాలజీ/బయో టెక్నాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్), డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iari.res.in/
భారీ జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు
సుప్రీంకోర్టులో 90 లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ.
పోస్టును బట్టి LLB, ఇంటిగ్రేటెడ్ లా అర్హతతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అడ్వకేట్గా ఎన్రోల్ అయినవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ. 100000 వెబ్సైట్:https://www.sci.gov.in/
ఏపీలోని ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు
AP: కాకినాడలోని ESIC హాస్పిటల్ 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 14వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి MBBS+ పీజీ, పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 69ఏళ్లు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://esic.gov.in
ఎయిమ్స్ గోరఖ్ పూర్ లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
AIIMS గోరఖ్పూర్ 22 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. MBBS అర్హత గలవారు ఫిబ్రవరి 11న, BDS అర్హత గలవారు ఫిబ్రవరి 14న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100 +NPA చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://aiimsgorakhpur.edu.in
350 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. అర్హతగల వారు ఫిబ్రవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును ໙໖ CFA/CA, MBA, PGDBM, PGDBA, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్ తో పాటు పని అనుభవం ఉండాలి. FEO పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://centralbank.bank.in
BECILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, డిప్లొమా, ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం జూనియర్ ఇంజినీరు నెలకు రూ.45వేలు, సూపర్వైజర్కు రూ.42వేలు, MTSకు 27వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.becil.com
154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, MLT, BE/BTech, MSc, MA/MSW, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.becil.com
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) పంచకులలో 7 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech/BSc(engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. ఏడాదికి రూ.5వేల చొప్పున పెంచుతారు. వెబ్సైట్: https://bel-india.in
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హతగల వారు FEB 16వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 - 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్కు నెలకు రూ.10వేలు, అటెండెంట్కు రూ.6వేలు చెల్లిస్తారు. సైట్:eastgodavari.dcourts.gov.in
JIPMERలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్(JIPMER) 10 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM, MD, MCh అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. FEB 24న మెరిట్ లిస్ట్ ప్రకటించి, FEB 27న ఇంటర్వ్యూకు పిలుస్తారు. నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు. వెబ్సైట్:https://jipmer.edu.in
80 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
UPSC 80 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ(BZC, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియోలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, Engg., ఎనిమల్ హజ్బెండరీ& వెటర్నరీ సైన్స్) అర్హత గలవారు FEB 24వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21- 32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.upsc.gov.in
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో ఉద్యోగాలు
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ 4 మెడికల్ ప్రాక్టీషనర్/స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు ఫిబ్రవరి 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, PG, PG డిప్లొమా అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. జనరల్ డ్యూటీ మెడికల్ ప్రాక్టీషనర్కు నెలకు రూ.95,000, స్పెషలిస్ట్కు రూ.1,23,500 చెల్లిస్తారు. వెబ్సైట్: https://clw.indianrailways.gov.in.

