టౌన్ ప్లానింగ్ డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన జీవీఎంసీ కమిషనర్

 


కడలి న్యూస్,  విశాఖపట్నం :– ఏపీ  టౌన్ ప్లానింగ్ టెక్నికల్ అధికారుల  అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్  కె వెంకటేశ్వరరావు సారధ్యంలో సోమవారం జీవీఎంసీ కార్యాలయంలో  జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ , జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ కె ప్రభాకర్ రావు, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి ,  మరో డిప్యూటీ సిటీ ప్లానర్ టీ జి రామ్మోహన్ రావు అసోసియేషన్ సభ్యులు తేజేశ్వరరావు లు టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ డైరీ ని, క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  జీవీఎంసీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు.  పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల కృషిని  కొనియాడారు. పట్టణాల సుందరీ కరణ కు, ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చెందేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న కృషిని కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రణాళికాయుతంగా భవనాలకు అనుమతుల నిస్తూ విశాఖ నగర అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు


కామెంట్‌లు