కమ్యూనిటీ భవనంను పునః ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్




ఎమ్మెల్యే వంశీకృష్ణ చొరవతో ఏడు లక్షల వ్యయంతో ఆధునీకరణ చేసిన వేదాంత కంపెనీ

నియోజకవర్గం లో ఆర్చులు, కమ్యూనిటీ హాల్ ల నిర్మాణంలో  గణనీయమైన పురోగతి

ఎన్నికల హామీలో భాగంగా సామాజిక భవన నిర్మాణాలకు, ముఖ ద్వారాల నిర్మాణాలకు పెద్దపీట వేసిన ఎమ్మెల్యే

కడలి న్యూస్,విశాఖపట్నం:– వేదాంత విజిసిబి పోర్ట్ సహకారంతో  39వ వార్డు పరిధిలో పద్మా నగర్ వద్ద శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే  వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై , ప్రారంభించారు .కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ  సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాజిక భవనాల రూపురేఖలను మారుస్తున్నామని అదేవిధంగా కొత్తగా పలు కమ్యూనిటీ హాల్ లో ప్రారంభించే దిశగా అడుగు వేస్తున్నామని తెలియజేశారు. ప్రజల అభివృద్ధి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు  పలు  నిర్మాణంతో పాటు సామాజిక భవనాలను ఏర్పాటులో  ప్రత్యేక  శ్రద్ధ చూపిస్తున్నామని తెలియజేశారు. శెట్టిబలిజ సామాజిక వర్గం నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యమైనదని వారు ఎన్నికల సమయంలో అన్ని విధాలుగా సహకరించారనీ వారిని ఎన్నటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏడు లక్షల వ్యయంతో   ప్రజా అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టారని, ఫ్లోరింగ్, విద్యుత్ ఏర్పాట్లు, లైటింగ్ తో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారని  తెలిపారు.  శెట్టి బలిజ సామాజిక భవనం పునః నిర్మాణానికి సహకరించిన వేదంత ,విజిసిబి పోర్ట్ సహకారానికి అదేవిధంగా జీవీఎంసీ సహకారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్  కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు,  స్థానిక కార్పొరేటర్ సాధిక్, ఎస్ కే ఎంఎల్ మాజీ చైర్మన్ కొల్లి  సింహాచలం, స్థానిక పెద్దలు శ్రీనివాస్, దానేష్ , రాజు, ఇల్లా రాజు, కోటమ్మ, ప్రణీత్ కొండబాబు,  తాతారావు, మసేన్, రాజాతో పాటు జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్  అప్పారీ గిరిబాబు, పెద్దలు కృష్ణ గౌడ్, గణేష్,  సి ఎస్ ఆర్ హెడ్ శ్రీ లక్ష్మీ , ఆపరేషన్ హెడ్ సత్యనారాయణ పాల్గొన్నారు...

కామెంట్‌లు