ఎంజీఎం పార్కులో కార్తిక దీపోత్సవం

కడలి న్యూస్, విశాఖపట్నం:–  వుడాపార్కు పక్కనే ఉన్న ఎంజీఎం పార్కులో తితిదే ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు కార్తిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ధర్మప్రచార పరిషత్ ప్రతినిధులు సత్యనారాయణ, సత్యకుమార్, సునీత తెలిపారు. రుషికొండ తి.తి.దే. ఆలయంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మార్పు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయంలో ధర్మప్రచార పరిషత్ సభ్యులు ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఎంజీ పార్కులో కార్తిక దీపోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. ఉచిత ప్రవేశ టోకెన్లు కలిగిన భక్తులు హాజరుకావాలని కోరారు

కామెంట్‌లు