మధురవాడకు మణిహారంగా వంతెన నిర్మాణం


కడలి న్యూస్, విశాఖపట్నం:–
ఎన్నో ఏళ్లుగా మధురవాడ చంద్రపాలెం వద్ద ప్రజలు ఎదురు చూస్తున్న నడక వంతెన ఆకాంక్ష నిన్న భూమి పూజతో ప్రారంభమయింది. ఆనం దపురం- విశాఖపట్నం జాతీయ రహదారిపై చంద్రంపాలెం ఉన్నత పాఠశాల వద్ద పై వంతెన కోసం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.3.23 కోట్ల వ్యయంతో ప్రజల రాకపోకల కోసం నిర్మిస్తున్న వంతెన మధురవాడ ప్రాంతానికి మణిహారంగా రూపుదిద్దుకుంతుందని తెలిపారు.

చంద్రంపాలెం పాఠశాలలో చదువుతున్న సుమారు 3 వేల మంది చిన్నారులను దృష్టిలో పెట్టుకుని త్వరలో రానున్న మెట్రో ప్రాజెక్టు డిజైన్ కు ఆటంకం లేకుండా ఆధునిక సాంకేతికతతో వంతెన నిర్మిస్తున్నామన్నారు. వంతెన నిర్మాణాన్ని అధికారులు మ్యాప్ ద్వారా ఆయనకు వివరించారు. కార్యక్రమంలో చిక్కాల విజయ్ బాబు, కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిల్లా మంగమ్మ, లొడగల అప్పారావు, గాడు వెంకటప్పడు, గంటా నూకరాజు, మొల్లి లక్ష్మణరావు, పిల్లా వెంకట్రావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు