గిరిజన స్వాతంత్య్ర సమర యోధుడు భగవాన్బర్షముండా జయంతి వేడుకలను విజయవంతం చేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ పిలుపు నిచ్చారు. అల్లూరి జిల్లా కేంద్రంలో గల స్థానిక ఎన్జిఓ కార్యాలయం వద్ద జనజాతి గౌరవ దివాస్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన తెగల పెద్దల సమావేశం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా భారత మాత, భగవాన్ బిర్షా ముండా చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం పాడేరు, అరకు, రంపచోడవరం, పార్వతీపురం నుంచి వచ్చిన వివిధ గిరిజన ఉప తెగల పెద్దలతో భగవాన్ బిర్షా ముండా జయంతి నిర్వహణ గురించి చర్చించి, పలు అభిప్రాయాలను సేకరించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం గిరిజన స్వాతంత్ర సమర యోధులు త్యాగాలు మరువలేనిదనీ అన్నారు, భగవాన్ బిర్షా ముండా ఆంగ్లేయులను ఎదరించి 25 ఏళ్ళకే ప్రాణ త్యాగం చేసారని అన్నారు.. త్యాగ మూర్తుల త్యాగలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15 న జనజాతీ (గిరిజ) గౌరవ దివాస్ గా ప్రకటించి గిరిజన ప్రజల ఆత్మ గౌరవాన్నీ నిలబెట్టారన్నారు, గిరిజన ప్రజల తరుపున ప్రధాని మోదీకి ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు, నవంబర్ 15 న బిర్షా ముండా జయంతి సందర్భంగా 16న పాడేరు లోని జూనియర్ కళాశాల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని గిరిజన తెగల ప్రజలు,బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, గిరిజన సంఘాల ను కలుపుకొని భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రజలు అందరూ కలిసి జనజాతీయ గౌరవ దివాస్ నీ నిర్వహించుకుని అదే రోజు భగవాన్ బిర్షా ముండా కాంశ్య విగ్రహ ప్రతిష్ట చేద్దాం అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి మట్ట ప్రసాద్, ఎస్టి కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి,ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమం క్షేత్ర సంఘటన కార్యదర్శి తాడేపల్లి రామకృష్ణ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఆదినారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు మఠం శాంత కుమారి,బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు, రాష్ట్ర కార్యదర్శి స్వప్న కుమారి, కేతినేని సురేంద్ర మోహన్, మాజీ మంత్రి మణికుమారి, అకాడమీ చైర్మన్ గంగులయ్య, ట్రైకర్ డైరెక్టర్ కూడ కృష్ణ రావు, కిల్లు రమేష్ నాయుడు, ఎస్టి కమిషన్ సభ్యులు కిల్లో సాయిరాం, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ప్రతినిధులు సన్యాసి నాయుడు, లకే రవీంద్ర పాత్రుడు, వైస్సార్సీపీ మహిళ అధ్యక్షులు కురుస పార్వతమ్మ, జనసేన అరకు నియోజకవర్గం ఇంచార్జి శెట్టి చిరంజీవి, జనసేన నాయకులు శెట్టి ఆనంద్,మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెనుమాక రవికుమార్, సల్ల రామకృష్ణ బీజేవైఎం నాయకులు గోపాల పాత్రుడు, పాంగి మత్స్య కొండ బాబు, అంగనైని ఆనంద్, జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర, ముక్కి శేషాద్రి, పాల్గొన్నారు.
జనజాతీయ గౌరవ దివాస్ని విజయవంతం చేద్దాం
• kadali