కడలి న్యూస్, విశాఖపట్నం:– రుషికొండలో గల తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం లో తృతీయ పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులు పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శ క్రవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. సఖల దేవతలను ఈ పవిత్రోత్సవాలకు ఆహ్వానం పలికే క్రమంలో ముందుగా విశ్వక్షేణునికి పూజలు నిర్వహించారు. తదుపరి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా శనివారం పవిత్ర ప్రతిష్య శ్నపన తిరుమంజనం, ఆదివారం మద్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు పవిత్ర సమర్పణ. సోమవారం సాయంత్రం 6గల నుండి. 8. గం.ల వరకు పూర్ణాహుతి, నిర్వహించనున్నామని, అదే విధంగా మూడు రోజులు పాటు ఉదయం 10:30 ని.ల నుండి 11.30 నిల వరకు శ్నపన తిరుమంజనం నిర్వహించనున్నామని ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ అడ్వైజర్లు, టిటిడి లోకల్ బాడీ సలహాదారుడు పట్టాభిరామ్, సూపరింటెండెంట్ వెంకటరమణ, వేద పండితులు, ఇనిస్పెక్టర్లు శివకుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
రుషికొండ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
• kadali