నిరుద్యోగులకు శుభవార్త

 


సికింద్రాబాద్లోని NIEPMDలో ఉద్యోగాలు

సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (NIEPMD) 13 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 17న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, బీటెక్/PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. www.niepid.nic.in


APPLY NOW: CCRASS ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS) 5 కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. BAMS, MD, MS (ఆయుర్వేదం), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు 50 వేలు చెల్లిస్తారు. https://ccras.nic.in


600 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్ 

RITESలో 600 సీనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BSc, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.100. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. NOV 23న రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్సైట్: www.rites.com


SBIలో మేనేజర్ పోస్టులు

SBI 10 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, బిఇ, MBA/PGDBM/PGDBA అర్హతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు డిసెంబర్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ పోస్టుకు 28- 40ఏళ్ల మధ్య, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 25 -35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.750. SC, ST, PWBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://sbi.bank.in


BRIC-ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో ఉద్యోగాలు

BRIC-ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ 5 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఎస్సీ, MVSC, డిప్లొమా ఉత్తీర్ణత, NET/GATE/GPAT అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. 40-50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్:https://www.ils.res.in


SBIలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు


SBI 5 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును ໙໖ MBA/MS/PGDBM/PGDBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in


భారీ జీతంతో రైట్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)17 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి నెలకు జీతం రూ.60 వేల నుంచి రూ.2.55 లక్షలు చెల్లిస్తారు. వెబ్సైట్:https://rites.com

MANAGEలో భారీ జీతంతో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(MANAGE)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, MBA/PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మేనేజర్కు నెలకు రూ.1.50లక్షలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్కు రూ.50వేలు చెల్లిస్తారు.వెబ్సైట్ : www.manage.gov.in


MIDHANIలో 210 పోస్టులు

మిశ్రమ ధాతు నిగమ్(MIDHANI)లో 210 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. BE, బీటెక్, ITI, డిప్లొమా అర్హతగలవారు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ITI ట్రేడ్కు నెలకు రూ.9,600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్కు రూ.10,900 చెల్లిస్తారు.

ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( RITES) 7 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PWBDలకు 5.300. వెబ్సైట్: http://www.rites.com


సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NIGST), సర్వే ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBA, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, PhD ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, FRF పోస్టులు వెబ్సైట్: https://surveyofindia.gov.in


ICAR-IARIS ఉద్యోగాలు

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, NET/ PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://new.iari.res.in


సౌత్ ఇండియన్ బ్యాంక్లో PO ఉద్యోగాలు

సౌత్ ఇండియన్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. CMA/ICWA అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.southindianbank.bank.in


SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు


SBI 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, సీఎఫ్, సీఎఫ్పీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక వెబ్సైట్: https://sbi.bank.in


52 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 52 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్) అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఈ నెల 24న రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bel-india.in


కామెంట్‌లు