కడలి న్యూస్, విశాఖపట్నం:– నగరంలోని బురుజు పేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా గురువారం, సాధారణ రోజుల్లో నిర్వహించే పంచామృతాభిషేకం టికెట్ల ధరలను భారీగా పెంచారు. ఈనెల 21 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు జరగనున్నాయి. గురువారం రోజున అర్ధరాత్రి, సాయంత్రం నిర్వహించే విశేష పంచామృతాభిషేకం టికెట్ ధర రూ.10 వేలకు పెంచారు. గతేడాది ఈ టికెట్ ధర రూ.7500లుగా ఉండేది. సాధారణ రోజుల్లో తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహించే పంచామృతాభిషేకం టికెట్ ధరను రూ.3 వేలకు పెంచారు. గతేడాది రూ.2500 ఉండేది. కమిషనర్ ఆమోదం మేరకు టికెట్ ధరను పెంచామన్నారు. ఈ టికెట్లను ఆన్లై న్ లో కూడా బుక్ చేసుకోవచ్చునని ఆలయ ఈఓ కె. శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు టికెట్లతో పాటు విశిష్ట దర్శనం టికెట్ రూ.500లను ఏపీ టెంపుల్ వెబ్సైట్ ద్వారా ముందస్తుగా భక్తులు బుక్ చేసుకోవచ్చునని పేర్కొ న్నారు. వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు 9552300009 ద్వారా కూడా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చునని ఆమె వివరించారు.
ఆన్లైన్లో కనక మహాలక్ష్మిమార్గశిర మాసోత్సవాల అభిషేకం టికెట్లు
• kadali