కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజాంలో నూతనంగా నిర్మించిన మజీద్ ఏ జుబైర్ ను ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజుతో కలిసి ప్రారంభించారు. ఎన్నికలలో ముస్లింలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. షాది ఖానాలు, మసీదులకు, మసీదుల అభివృద్ధికి ప్రభుత్వం స్థలాలు నిధులు మంజూరు చేస్తుందన్నారు. తల్లికి వందనం లాంటి పథకం ముస్లింల విద్యకు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చేసి ఆధ్యాత్మిక చింతనతో దీన్ మార్గంలో పయనించాలి అన్నారు. కుల మతాలకు అతీతంగా సమాజానికి, దేశానికి సేవ చేయాలన్నారు వివిక్షరహిత సామాజిక న్యాయమే లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ముస్లింల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. రాజాం నిర్మించిన మసీదు నిర్ నిర్వహణకు రూ.లక్ష తన సొంత నిధులను ఇస్తానని ప్రకటించారు. ముస్లిం సోదరులు పిల్లలకు ఉన్నత విద్య అందించాలన్నారు. విద్యతోనే కుటుంబాలు బాగుపడతాయి అన్నారు. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యపై సృష్టి సారించాలి అన్నారు. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ ప్ర భుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ముస్లిం సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలి అన్నారు. చింతూరు కి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జమాల్ ఖాన్ మసీదు నిర్వహణకు రూ. లక్ష ప్రకటించారు. మిందికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్ సలీం ప్రతినెల మసీదు నిర్వహణకు రూ.10 వేలు అందిస్తానని ప్రకటించారు. రాష్ట్ర ముస్లిం మత పెద్దలు షేక్ ఇస్మాయిల్, షేక్ సుభాన్,షేక్ ఇబ్రహీం, షేక్ ఖాన్ సాహెబ్, షేక్ బాడ్జి,షేక్ ఇబ్రహీం, షేక్ బాబర్, స్థానిక ముస్లిం మత పెద్దలు నియోజవర్గ టిడిపి ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అన్సర్ వలీ, షేక్ సత్తార్, డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, ఎంపీపీ డి. నాగేశ్వరీ దేవి, తహసీల్దార్ ఎం.లక్ష్మి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ సిరిగిరిశెట్టి శ్రీరామమూర్తి, మాజీ ఎంపీపీ ఎంవివి సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి వియ్యపు అప్పారావు, పిఎసిఎస్ అధ్యక్షుడు కోట సత్యనారాయణ, డిసిసిబి మాజీ అధ్యక్షుడు కోరుకొండ రవికుమార్,స్థానిక సర్పంచ్ మరిశా నాని,మాజీ ఎంపీటీసీ మరిసా సతీష్ టిడిపి నేత మరిసా నరేష్,షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.
మసీదు నిర్మాణానికి లక్షరూపాయలు ఆర్థిక సహాయం
కడలి న్యూస్, విశాఖపట్నం:– మసీదు నిర్మాణానికి లక్షరూపాయలు ఆర్థిక సహాయం చేసినట్లు విమల ఇన్ఫాస్ట్రక్చర్ డైరెక్టర్ షేక్ సలీం తల్లి లాల్ బిబి అన్నారు. రాజం గ్రామంలో మసీదు నిర్మాణం లక్ష రూపాయలు, ప్రతి నెల మసీదు నిర్వహణ కార్యక్రమాలకు 10 వేలు రూపాయలుఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సంద ర్భంగా బిబి మాట్లాడుతూ ఒక ముస్లింకు మసీదు నిర్మాణంలో సహకారం అందించ డం ఒక పవిత్ర కార్యక్రమం అని ప్రవక్త ముహమ్మద్ చెప్పారన్నారు.ఎవరైతే అల్లాహ్ అనుగ్రహాన్ని కోరుతూ అల్లాహ్ కోసం మసీదు నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారో అల్లాహ్ అతనికి స్వర్గంలో ఒక ఇంటిని నిర్మిస్తాడు అని కురాన్ లో రాసి ఉందన్నారు. ముస్లింలు అందరూ కూడా మసీద్ నిర్మాణానికి వారి శక్తి కొలది సహాయం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా లాల్ బిబిను ముస్లిమ్ పెద్దలు సత్కరించారు.
