జాతీయ సదస్సుకు విఎంఆర్డిఎ తరపున చైర్మన్ ప్రణవ్, జాయింట్ కమీషనర్ రమేశ్ ప్రాతినిథ్యం

 


కడలి న్యూస్, విశాఖపట్నం:–
  ఈ నెల  9 వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో డిల్లీలో జరుగుతున్న 18 వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో -2025 జాతీయ సదస్సులో విఎంఆర్ డిఎ చైర్మన్ వి ప్రణవ్ గోపాల్ , జాయింట్ కమిషనర్ కె రమేశ్ పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అందిన ఆహ్వానం మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ తరుపున జాతీయ సదస్సుకు విఎంఆర్ డిఎ తరపున వీరిద్దరూ ప్రాతినిధ్యం వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహ, పట్టణ వ్యవవహారాల మంత్రిత్వశాఖ మంత్రి మనోహర్ లాల్ ముఖ్య అతిథిగా పాల్గొని, సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో ప్రయాణ సదుపాయాలు, కాలుష్యం లేని ప్రయాణం, మెరుగైన రవాణా సదుపాయం, రద్దీ నియంత్రణకు తీసుకోవాల్సిన పలు అంశాలు వివరించారు. అలానే మెట్రో నెట్వర్కింగ్ విషయంలో ప్రపంచంలోనే ప్రస్తుతం మూడో స్థానంలో భారత దేశం ఉందని, అతి త్వరలో ఈ విషయంలో రెండో స్థానంలో రావటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విఎంఆర్ డిఎ చైర్మన్ l ఎం వి ప్రణవ్ గోపాల్ , జాయింట్ కమిషనర్ కె రమేశ్  మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహా విశాఖ పట్టణంలో ప్రస్తుత రవాణా సదుపాయాలు, త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ గురించి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్దం చేయటం జరుగుతోందని కేంద్ర మంత్రి వర్యులు మనోహర్ లాల్ కి వివరించారు. విఎంఆర్ డిఎ పరిధిలో రవాణా సదుపాయం మెరుగుపరిచేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు చేపడుతున్న విదానాన్ని తెలియజేశారు. అనంతరం జాతీయ సదస్సులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్ట్ ల పై ఏర్పాటుచేసిన ప్రదర్శనను  సదస్సులో. ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మెట్రో ప్రాజెక్టుల వివరాలని ఆయా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

కామెంట్‌లు