విశ్రాంత అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహ్మద్ ఖాన్ కు అభినందనలు


కడలి న్యూస్, విశాఖపట్నం:–
  వెటరన్ అథ్లెటిక్స్ అసోసిషన్ ఆఫ్ విశాఖపట్నం నిర్వహించిన డిస్ట్రిక్ట్ వెటరన్ అథ్లె టిక్స్ ఛాంపియన్షిప్ - 2025 క్రీడా పోటీలలో పాల్గొని 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, జావలిన్ త్రో లో రజత పతకాలను గెలుచుకొని, డిసెంబర్ 13,14 తేదీలలో గుంటూరులో జరగనున్న 45 వ ఎ పి స్టేట్ అథ్లెటిక్స్ చాపిన్షిప్-2025 పోటీలకు అర్హత సాధించిన పూర్వపు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహ్మద్ ఖాన్ ను నగర సీపీ శంక బ్రత బాగ్చీ, వావ్ చీఫ్ పేటర్న్ డాక్టర్ కమల్ బయిద్ల ప్రశంసలను అందుకున్నారు. ఈ సందర్భంగా మురళీనగర్ వావ్ కార్యాలయంలో ఏర్పాటు చేసినకార్యక్రమంలో వావ్ అధ్యక్షులు, ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ సెక్రటరీ జనరల్ డా. మంగా వరప్రసాద్ మాట్లాడుతూ ఆరు పదుల వయసులోనూ అద్భుత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన ఖాన్ క్రమం తప్పకుండా తెల్లవారక ముందే రైల్వే గ్రౌండ్లో టెన్నిస్ ఆడుతూ దేహధారుడ్యాన్ని కాపాడుకుంటూ ఎంతో క్రమశిక్షణలో నేటి యువతరంతో పోటీపడుతూ రాష్ట్ర పోటీలకు ఎదగడం క్రీడల పట్ల ఆయనకున్న నిబద్దత, అకుంఠిత దీక్షలకు నిదర్శన మన్నారు . వావ్ పీ ఆర్ ఓ వంశీ చింతలపాటి మాట్లాడుతూ వృత్తిలోనూ, క్రీడల లోనూ, విపంచి గాయనీ గాయకుల సంఘం అధ్యక్షుని గాను, స్నేహపూర్వకంగా తనదైన ముద్రతో మహమ్మద్ ఖాన్ ప్రముఖుల మన్ననలను అందుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా వావ్ అధ్యక్షులు డా. మంగా వరప్రసాద్ మెడల్స్ ను, ధ్రువ పత్రాలను మహమ్మద్ ఖాన్ కు అందజేయగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఛైర్ పర్సన్ వంశీ చింతలపాటి మహమ్మద్ ఖాన్ ని శాలువాతో సత్కరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొని ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. శ్రీదేవి మహానటి సాంస్కృతిక సేవా సంస్థ బృందం తమ అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు