ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

 – 


వస్త్ర సంచులను వినియోగించండి

- ఒకసారి వాడి వదిలేస్తే ప్లాస్టిక్ వద్దే వద్దు

- మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచాలి. 

- మడక అప్పలరాజు, సర్పంచ్, జెర్రిపోతులపాలెం.

కడలి న్యూస్, విశాఖపట్నం:– వస్త్ర సంచులను వినియోగించండి అని పెందుర్తి మండలం, జెర్రిపోతులపాలెం పంచాయతీ సర్పంచ్ మడక అప్పలరాజు కోరారు. బుధవారం ఉదయం యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణకుమారి మేఘాద్రిగెడ్డ జలాశయం లో చేపలు వేటాడి జీవిస్తున్న వారితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచాలి అని కోరారు. ఒక్క సారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దె వద్దు అని కోరారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను జయప్రదం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరు పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవరచు కోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో చేపలు వేటాడి జివిస్తున్న జెర్రిపోతులపాలెం గ్రామస్తులు ప్రతినిధి దేవుడు, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణ కుమారి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు మాట్లాడారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ , గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవోల నేతృత్వంలో  గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది.

కామెంట్‌లు