బాలల సంరక్షణ విభాగంలో దత్తత ప్రక్రియపై అవగాహనా కార్యక్రమం

 


కడలి న్యూస్, విశాఖపట్నం:– విశాఖ వేలీ స్కూల్ విశాఖపట్నం దగ్గర గల ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనము మరియు పరిశీలన గృహము నందు జాతీయ దత్తత మాసము కార్యక్రమము కింద జిల్లా బాలల సంరక్షణ విభాగం అద్వర్యం లో దత్తత ప్రక్రియ మీద అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా బాలల సంరక్షణ అధికారి కె హరికృష్ణ మాట్లాడుతూ దత్తత యొక్క ప్రాముఖ్యత ను వివరించారు ప్రతి  చైల్డ్  కుటుంబ వాతావరణంలో పెరిగితేనే ఆ బాలలు సామాజికమైన ఎవరోదాలు లేకుండా ఉన్నత భవిష్యత్తు పొందగలరు అని ప్రతీ చైల్డ్ ఉన్నతమైన జీవితాన్ని పొందటమే ఈ దత్తత కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని వివరించారు... ఈ నవంబర్ నెల మొత్తం అవగాహనా కార్యక్రమాలు జరుగుతాయి అని తెలియచేశారు... ఈ కార్యక్రమంలో హోమ్ సూపరింటెండెంట్ సి నయోమి మరియు ప్రొటెక్షన్ ఆఫీసర్ దాసరి చంద్రశేఖర్ పాల్గొన్నారు

కామెంట్‌లు