14 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు


కడలి న్యూస్, విశాఖపట్నం:–
    ఈ నెల 14 నుంచి బీచోడ్డు లోని రుషికొండ శ్రీవారి ఆలయం (అతిదే)లో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఏఈజి జగన్మోహనాచార్యులు తెలిపారు. 4 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయన్నారు. 15 నుంచి 17 వరకు మూడు రోజులు ఉదయం, సాయంత్రం యోగశాలలో హోమాలు, ప్రతి రోజు ఉదయం 10. 30 నుంచి 11.30 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

కామెంట్‌లు