కడలి న్యూస్ :– డిల్లీ గోలీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన బాలాజీ మందిరంలో సాధ్యమైనంత త్వరగా నిత్యాన్నదానం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకు ఇస్కాన్ ఆధ్వర్యంలోని అక్షయపాత్ర.. లేదంటే ఇతర సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. శనివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, దిల్లీ తితిదే ఆలయ సలహా కమిటీ చైర్మన్ సుమంత్రెడ్డిలు ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ఆలయ వ్యవహారాల పర్యవేక్షణకు నోడల్ అధికారిగా ఏపీభవన్ రెసి డెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ను నియమించారు. ప్రస్తుతం దిల్లీ ఆలయానికి సాధారణ రోజుల్లో వెయ్యి నుంచి 1,500 మంది దాకా భక్తులు వస్తున్నారని, ఆ సంఖ్యను పెంచేందుకు ప్రచారం కల్పించాలని తీర్మానిం చారు. ఏపీభవన్లోని తితిదే సమాచార కేంద్రాన్ని పున రుద్దరించి తిరుమలలో అందించే సేవల వివరాలను దేశ రాజధాని, చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులకు ఎప్పటిక ప్పుడు తెలియజేయడంతోపాటు, తిరుమల ప్రసాదం, క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంచాలని తీర్మానిం చారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వాటి ప్రత్యక్షప్రసారాలను ఇక్కడ పెద్దతెరలపై ప్రదర్శిం చాలని నిర్ణయించారు. తెలుగువారితోపాటు తమిళ, కన్నడ, కేరళ సంఘాలను ఆహ్వానించి ఇక్కడి వేంకటే శ్వరస్వామివారికి నిర్వహించే సేవలు, ఉత్సవాల్లో పాల్గొ నేలా ప్రోత్సహించాలని తీర్మానించారు.
డిల్లీ తితిదే ఆలయంలో త్వరలో నిత్యాన్నదానం ప్రారంభం
• kadali