ఘనంగా శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి రాట మహోత్సవం



అంగరంగ వైభవంగా అమ్మవారి రాట మహోత్సవ వేడుక

అత్యంత వైభవంగా మార్గశిర మాసోత్సవములు నిర్వహించేందుకు ఏర్పాట్లు

 కడలి న్యూస్, విశాఖపట్నం:– కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత బురుజుపేటలో వెలసియున్న  శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి జరగబోయే మార్గశిర  మాసోత్సవములు సందర్భంగా రాట మహోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజ  అనంతరం రాట మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో తీర్థప్రసాదములను  అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవములు ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో దర్శనం ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. ఆలయ ఈవో కె. శోభారాణి మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జి. విజయలక్ష్మి, కె. నాగరాజు, ఆలయ అధికారులు సీహెచ్ వి.రమణ, ఎస్. అనంద్ కుమార్, కె. రాజేంద్రకుమార్, ఎంవీ.రమణ, కె. పద్మజ, కనకరాజు, వేద పండితులు, నరసింహాచారి, కూటమి వార్డు అధ్యక్షులు, స్థానిక టిడిపి, జనసేన ,బిజెపి నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌లు