శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మసోత్సవముల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
ఈ నెల 27 వ తేదీన మొదటి గురువారం
శివాజీపాలెం క్యాంపు కార్యాలయం లో అమ్మవారి మాసోత్సవములు పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే
ఈరోజు శివాజీ పాలెం క్యాంప్ కార్యాలయంలో ఈనెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు బురుజుపేట లో జరగబోయే శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా మొదటి గురువారం నవంబర్ 27 న, రెండవ గురువారం డిసెంబర్ 4 న, మూడవ గురువారం డిసెంబర్ 11న, నాల్గవ గురువారం డిసెంబర్ 18న మరియు రథయాత్ర డిసెంబర్ 13వ తారీకున, మహా అన్నదాన ప్రసాదం 18వ తేదీన జరగనున్నట్లు ఆలయ ఉప కమిషనర్ మరియు కార్య నిర్వహణ అధికారి శ్రీమతి శోభారాణి గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సామాన్య భక్తులకు , నియోజకవర్గ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. త్వరలో అమ్మవారి మార్గశిర మాసోత్సవముల నిర్వహణకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి ఆది నుంచి నడుస్తున్న సాంప్రదాయాలను కొనసాగించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్ కుమార్, ఈ ఈ రమణ, డి ఈ హరి రాజు, టెంపుల్ ఇన్స్పేటర్ నరసింహనాయుడు, సదరణ ఇన్స్టిట్యూట్స్ అధినేత సతీష్ పొన్నం, ఇతర పెద్దలు పాల్గొన్నారు..
.jpg)