కడలి న్యూస్, విశాఖపట్నం:– స్ఫూర్తిదాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మహా నగరంలో రెండు ఐక్యత యాత్రలు నిర్వహిస్తున్నట్లు విశాఖపట్నం లోక్ సభ సభ్యులు శ్రీ భరత్ తెలియజేశారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈనెల12 వ తారీఖు న బుధవారం ఉదయం విశాఖ సాగర తీరంలో ఈ యాత్ర నిర్వహించడం జరుగుతొందని తెలిపారు. . రెండవ యాత్ర ఈనెల 17వ తేదీన పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ (నెహ్రూ యువ కేంద్రం) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యార్థులు పుర ప్రముఖులు పాల్గొంటారని ఎంపీ చెప్పారు. దేశభక్తి, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం, యువతను భాగస్వాములను చేస్తూ, ఐక్యతా స్ఫూర్తి యాత్ర నిర్విస్తున్నట్లు తెలియజేశారు. భారత తొలి ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అందులో భాగంగా మహా విశాఖ నగరంలోని సాగర తీరంలోని రామకృష్ణ బీచ్ వద్దగల శ్రీ కాళీమాత ఆలయం నుండి యూత్ హాస్టల్స్ వరకు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలియజేశాడు. 17వ తేదీన పారిశ్రామిక ప్రాంతంలోని పాత గాజువాక నుండి కొత్త గాజువాక వరకు యాత్ర ఉంటుందన్నారు. స్వాతంత్ర్య భారతదేశంలో 565 సంస్థలను విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లబాయ్ పటేల్ కు దక్కుతుందని అన్నారు. అత్యంత దైర్యశాలి, రాజకీయ చతురత కలిగిన సర్దార్ జీవితం నేటి యువతకు స్ఫూర్తి దాయకమని అన్నారు. దేశ వ్యాప్తంగా నెల రోజులపాటు ఐక్యతా మార్చ్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఎం.పి. శ్రీ భరత్ తెలిపారు.
