శుభకరం.. రాధమ్మ పాద దర్శనం..!
కడలి ఆధ్యాత్మికం
శివ, కేశవులు వేరు కాదని, హరిహాదుల్లో ఎలాంటి బేధం లేదని కార్తిక మాస పూజల సారాంశం, విశ్వ ప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో జగ న్నాధుని సన్నిధిలో రాధాదామోదర వ్రతాలు కీలకం, మరోవైపు పూరీకి చేరువలోని సాక్షిగోపాల్లో రాధ, గోపినాథుల దర్శనం అత్యంత శుభకరంగా భక్తులు పేర్కొం టారు. కార్తిక మాసం శుక్షపక్షమి నవమి తిథి పర్వదినాన రాధమ్మ పాదదర్శనం మంగళదాయకం, ఒవలా నవమిగా భక్తులు ఆచరించే ఈ మహావేడుక శుక్రవారం (31న) జరగనుండగా సాక్షిగోపాల్లో ఉత్సవ వాతావరణం నెలకొంది.
సమ్మోహనం రాధామాధవ సన్నిధి.. పూరీ పురుషోత్తమ దర్శనం చేసుకునే భక్తులంతా గోపినాథుని సన్నిధికి వస్తారు. సాక్షిగోపాల్లో లోని రాధామాధవ దివ్యమై నది, మహత్తరమైనది, చారిత్రకమైన ఈ ఆలయం విశిష్టత గురించి శ్రీక్షేత్ర ఆస్థాన పురాణంలో విపులంగా ఉంది. బృందావనం నుంచి శ్రీమన్నారాయణుడు ఒక భక్తుని కోరిక మేరకు నడిచి వచ్చి దర్శన మిస్తారు. కోటి జన్మల ఫలం.. కార్తికం మాసం ఒవలా నవమినాడు రాధా మాధవ దర్శనం కోటి జన్మల ఫలంగా భక్తులు పేర్కొంటారు. రాధామ్మ పాదదర్శనంతో మహాపాతకాలు తొలగి, శుభాలు చేకూరు తాయన్న నమ్మకం ఆందరిలో ఉంది. పూరీలో నెలరోజులు కార్తిక వ్రతాలు చేసే హబిషా ర్థులు (దీక్షాధారులు) సాక్షిగోపి నాథున్ని రాధామ్మను ఆరాధి స్తారు. దూర ప్రాంతాల నుంచి భక్తులొస్తారు. ఇక్కడ రుచికర మైన జున్నుతో తయారు చేసిన అట్లు స్వామికి నివేదిస్తారు. ప్రతిరోజు రెండు పూటలూ దీన్ని అర్పించడం ఆనవాయితీ.
గట్టి బందోబస్తు.. శుక్రవారం
ఒవలా నవమి పురస్కరించుకుని సాక్షిగోపినాథ్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడనుంది. తల్లి పాద దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పూరీ జిల్లా యంత్రాంగం గట్టిబందోబస్తు చేపట్టింది. పాలనాధికారి దివ్య జ్యోతి పరిడ గురువారం విలేకరు లతో మాట్లాడుతూ.. భక్తుల సౌక ర్యానికి ప్రాధాన్యతిచ్చి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
.jpeg)
