కడలి ఆధ్యాత్మికం
రక్షాబంధన్ రోజు కట్టిన రాఖీని దసరా వరకు ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. కనీసం జన్మాష్టమి (ఆగస్టు 16) వరకైనా ధరించాలి. ఆ తర్వాత దానిని నది, చెరువులో నిమజ్జనం చేయాలి. సోదరి ప్రేమకు గుర్తు కాబట్టి దానిని తీసివేసేటప్పుడు ఎలాపడితే అలా తెంచి వేయకూడదు. రాఖీని జాగ్రత్తగా ముడి విప్పి తీసివేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల సోదర బంధం బలపడుతుందని, శుభ ఫలితాలు కూడా కలుగుతాయని పండితులు అంటున్నారు.