కడలి న్యూస్:– ఏపీలో కొత్త 'స్మార్ట్' రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.
ఎటిఎం తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి. వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.