మా డిమాండ్ ఇదే.. మద్దతు తెలపండి: రాహుల్ గాంధీ


👆👆👆Click video 

KADALI news:– ఓట్ చోరీ జరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

అయితే రాహుల్ ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అత్యవసరమన్నారు. ‘పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని EC ని డిమాండ్ చేస్తున్నాం.  http://votechori .in/ecdemand ను విజిట్ చేసి, లేదా 9650003420కు మిస్డ్ కాల్ ఇచ్చి మాకు మద్దతు తెలపండి' అని ప్రజలకు పిలుపునిచ్చారు.

 ఇటీవల ఓ నివేదిక విడుదల చేస్తూ ఓటర్ల చేర్పు విషయంలో బీజేపీతో ఈసీ కుమ్మక్కైంది అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 'మహారాష్ట్రలో MLA ఎలక్షన్ టైంలో 5 నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. ఐదేళ్లలో నమోదైన వారి కంటే ఈ సంఖ్య ఎక్కువ. ఎలక్షన్ రోజు సా.5 గంటల తర్వాత భారీగా పోలింగ్ నమోదైంది. ఎంపీ ఎన్నికల సమయంలో కోటిమంది ఓటర్లు నమోదయ్యారు. ఈ జాబితా మాకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించింది. దీంతో ఈసీ కుమ్మక్కైందని అర్థమైంది' అని విమర్శించారు.

కామెంట్‌లు