కడలి న్యూస్:– 'ఒక్క ఛాన్స్' అంటూ సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కంపెనీల బయట ఎదురు చూసేవారు ఎందరో. అవకాశం వస్తే టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తుంటారు. తాజాగా టాలీవుడ్ నిర్మాతలు నిర్ణయంతో అలాంటి వారిలో ఆశలు పెరిగాయి. ఈ నిర్ణయంతో ఆసక్తి ఉన్న వారికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో కొత్తవారికి అవకాశాలు దొరకనున్నాయి. అయితే అర్హత ఉన్నవారికే చోటు ఇస్తారా? రికమండేషన్లకు ప్రాధాన్యం ఇస్తారా? అనే ప్రశ్నలూ లేవనెత్తుతున్నాయి.
ఏది ఏమైనా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుందామనుకునే వారు పైన బ్లూ కలర్ లో కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ అనే దానిపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోండి.