బ్రహ్మకుమారీస్‌ సేవలు ప్రశంసనీయం :పోలీస్ కమీషనర్

పరమ పవిత్రం రక్షా బంధన్‌ --సోదరభావానికి స్పూర్తిదాయకం --సేవలు, సహనం స్పూర్తితో ముందుకు సాగుదాం

-బ్రహ్మకుమారీస్‌ సేవలు ప్రశంసనీయం

:నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ



కడలి న్యూస్, విశాఖపట్నం:–
సోదర భావాన్ని పెంపొందించడంతో పాటు, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రతబాగ్చీ పిలుపునిచ్చారు. గురువారం డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఏర్పాటు చేసిన రక్షా బంధన్‌ వేడుకల్లో పోలీస్‌ కమిషనర్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. రక్షాబంధన్‌ అంటేనే అత్యంత ముఖ్యమైన పర్వదినమని, ప్రతి ఇంట శుభం జరిగేందుకు ఎక్కువ మంది ఈ వేడుకలను నిర్వహించుకుంటారన్నారు. పురాణాలు,ఇతిహసాలలో కూడా రక్షాబంధన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ద్రౌపదీ శ్రీకృష్ణ భగవానుడికి రక్ష కట్టి తనను ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. అందువల్లే ద్రౌపదికి శ్రీకృష్ణుడు అన్ని వేళలా అండగా నిలిచారన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో ముందుకు సాగినప్పుడు సమాజంలో ఘర్షణలకు, వివాదాలకు అవకాశం ఉండదన్నారు. తనను గుర్తుంచుకుని బ్రహ్మకుమారీస్‌ రక్ష కట్టడం సంతోషం కలిగిస్తుందన్నారు. విశిష్ట అతిధిగా హాజరైన ప్రముఖ సంఘ సేవకులు కమల్‌ బెయిడ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు సహయ కార్యక్రమాలు అందించాలన్నారు. తనకు రక్షా బంధన్‌ వేడుకలంటే ఎంతో సెంటిమెంట్‌తో కూడుకున్నదన్నారు, సొదర భావానికి రక్షా బంధన్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు. బ్రహ్మకుమారీస్‌ ప్రతినిధులు బికె రామేశ్వరి, శివలీల మాట్లాడుతూ ప్రతీ ఏటా రక్షా బంధన్‌ వేడుకలు జర్నలిస్టుల నుంచే ప్రారంభించడం అనవాయితీగా వస్తుందన్నారు. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పర్వదినం మానవ జాతికే కాకుండా సకాల జీవరాశులకు ప్రకృతిని కూడా కఠినాతి కఠినమైన ఆపదల నుంచి రక్షించి తిరిగి మానవ సృష్టిని సువర్ణభారతంగా తయారు చేసేందుకు ఇటువంటి పండుగలు దోహదం చేస్తాయన్నారు. ఏజ్‌ కేర్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ ఎన్‌,ఎస్‌ రాజు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సీనియర్‌ పాత్రికేయులు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ తదితరలంతా మాట్లాడుతూ సమాజంలో బ్రహ్మకుమారీస్‌ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రతి పండగను జర్నలిస్టులతో జరుపుకోవడం అత్యంత అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అతిధులతో పాటు, పెద్ద ఎత్తున జర్నలిస్టులకు రాఖీలు కట్టి లడ్డూ మిఠాయిలు. జ్ఞాపికలను అందజేశారు.

కామెంట్‌లు