కడలి న్యూస్, విశాఖపట్నం:– సాగర్ నగర్ లోని ఇస్కాన్ మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఉత్సవాలలో రెండవ రోజైన ఈరోజు అత్యంత వైభవంగా జరుపబడింది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆగస్టు 16 వ తేదీ ప్రధాన జన్మ దినంగా జరుపబడుచున్నది.
ఈరోజు కార్యక్రమము మంగళ ఆరతితో మొదలైంది. తదుపరి భక్తులందరూ సామూహిక హరినామ జపము చేయడం జరిగింది. పూజ్య నితాయి సేవినీ మాతాజీ మరియు మందిర అధ్యక్షులు శ్రీమాన్ సాంబ ప్రభుజీ వారు కృష్ణ లీలపై ప్రవచనం చేసారు. ఈరోజు కూడా పుణ్య నదులనుండి సేకరించిన జలాలు మరియు పంచామృతాలు ఉపయోగించి అభిషేకం కొనసాగింది.
శ్రీ శ్రీ రాధా దామోదరుల విగ్రహాలను వృందావనము నుండి తెప్పించిన పట్టు వస్త్రాలతోనూ, దేశములోని వివిద ప్రాంతాలనుండి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతోనూ అలంకరించారు. అత్యంత రమణీయంగా అలంకరించిన స్వామి వారిని ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దర్శనమిస్తారు. స్వామి వారి దర్శనానికి విశాఖ నగర వాసులు మరియు పరిసర ప్రాంతాల వారు వేలాదిగా భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుని పునీతులయ్యారు. దర్శనం అనంతరం భక్తులందరూ మృదువైన ఉయ్యాలలో ఉంచిన బాల గోపాలునిని ఊపుతూ అత్యంత భక్తి పారవశ్యంతో ఉయ్యాల సేవ చేసారు. అనంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసదాలను స్వీకరించారు. దర్శనానికి ముందు ఔత్సాహికులైన భక్తులు 108 సార్లు హరేకృష్ణ మహా మంత్రాన్ని జపించి తరువాత దర్శనము చేసుకునే విధముగా ప్రత్యేక హరినామ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హరినామ జపము ద్వారా భక్తులు పవిత్రీకరించబడిన మనస్సుతో మరియు భక్తి తప్త హృదయంతో భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం కలిగినది. సాయంత్రం జరిగిన ఉట్లోత్సవం భక్తులనెంతగానో ఆకట్టుకుంది. అనంతరం జరిగిన రాధాకృష్ణ వేషదారణ, నృత్య పోటీలలో వేలమంది చిన్నారులు పాల్గొని భగవంతుని లీలలను స్మరింపజేసారు. ఈ పోటీలు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి
రాత్రి 10 గంటలనుండి స్వామి వారి మహా అభిషేకం ప్రారంభమవుతుంది. ఈ అభిషేకానికి వివిద పుణ్య నదుల నుండి సేకరించిన పవిత్ర జలాలు, పళ్ళ రసాలు, పంచామృతం, పంచగవ్యాలు మరియు వివిధ పుష్పములు ఉపయోగించడం జరుగుతుంది. ఈ అభిషేకం 108 కళాశాలతో జరుపబడుతుంది. అనంతరం స్వామి వారికి 1008 దీపాలతో మహా ఆరతి జరుపబడుతుంది. ఈ అభిషేకం భక్తులు భక్తి పారవస్యంతో చేసిన హరినామ కీర్తన మధ్య జరుగుతుంది. అనంతరం రోజంతా ఉపవాసం చేసిన భక్తులు స్వామివారికి అభిషేకం చేసిన చరణామృతంతో ఉపవాస విరమణ చేస్తారు. ఈ కార్యక్రమములో వివిద కళాశాలలనుండి వచ్చిన విద్యార్థులు మరియు ఎన్.సి.సి. కేడెట్లు భక్తులు సౌకర్యార్థం సేవ చేసారు. నగరములోని ప్రముఖ గాయకులతో ఆలపించబడిన అన్నమయ్య కీర్తనలు, నృత్యకారులు ప్రదర్శించిన నాట్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్య క్రమములో పాలుగున్న భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది .మహావిశాఖపట్నం మేయర్ పీల శ్రీనివాసరావు, మరియు వివిద ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని భగవంతుని దర్శనం చేసుకున్నారు. మందిర అధ్యక్షులు శ్రీమాన్ సాంబ దాస్, పూజ్య నితాయి సేవిని మాతాజీ వారి కృష్ణ లీలా ప్రవచనము సందర్శకులను భక్తి పారవశ్యములో ముంచెత్తాయి.
మరిన్ని వివరాలకు మా ప్రతినిథి వంశీకృష్ణ ప్రభును సంప్రదించగలరు – 8978971415