ఏ ఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ ఆధునిక పరికరాలతో మరింత బలోపేతం

కడలి న్యూస్, విఖపట్నం:– ఏ.ఎస్.రాజా వాలంటరీ బ్లడ్ సెంటర్‌లో రక్త విభజన ప్రక్రియను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మార్చేందుకు అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. ఇందులో థర్మోఫిషర్ 16-బకెట్ సెంట్రిఫ్యూజ్ (జర్మనీ), మోడరన్ బ్లడ్ కలెక్షన్ మానిటర్, ఆర్కిమీడ్ ఆటోమేటిక్ కాంపోనెంట్ ఎక్స్‌ట్రాక్టర్ ఉన్నాయి.

ఈ పరికరాలను 100 సార్లు రక్తదానం చేసిన నగేశ్ మోటమర్రి, సాధారణ రక్తదాత అయిన  రాణాప్రతాప్ అలాగే విశాఖ వాలంటీర్లకు చెందిన సతీష్ కలిసి ప్రారంభించారు. వీరంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ సందర్భంగా   రాణాప్రతాప్ ఈ రోజు రక్తదానం చేశారు. 

1995లో స్థాపించబడిన ఈ కేంద్రం, విశాఖపట్నంలో రోగులకు సురక్షిత రక్తాన్ని అందించడంలో, ముఖ్యంగా థలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియా బారిన పడిన చిన్నారులకు సహాయం చేయడంలో, అలాగే ఆరోగ్య సేవల అభివృద్ధికి విశేష సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో డా. సుగంధి తదితరులు పాల్గోన్నారు.

కామెంట్‌లు