– మే 16, 17 తేదీల్లో శని, ఆది వారాలు విశాలాక్షి నగర్ బివికె కళాశాలలో
- పాలెం నేచురల్స్ అశోక్, కార్యదర్శి, గోఆదారిత ప్రకృతి ఆధారిత రైతుల సంఘం
కడలి న్యూస్, విశాఖపట్నం:– సేంద్రియ మామిడి పండ్ల మేళాను జయప్రదం చేయమని గో ఆదారిత ప్రకృతి ఆధారిత రైతుల సంఘం కార్యదర్శి పాలెం నేచురల్స్ అశోక్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విశాలాక్షి నగర్లోని బివికె విద్యా సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం మే16న సాయంత్రం 5 గంటల నుండి ఆదివారం మే 17 రాత్రి వరకు విశాలాక్షి నగర్ బివికె కళాశాలలో మామిడి పండ్లు మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళాలో పంచదార కలిశాలు, పండూరి మామిడి, కొత్తపల్లి కొబ్బరి, స్వాగతం, అమృతం, పాపారాజు గోవా, నాగులపల్లి ఇరసాలు, హైదర్ సాయిబు, జహంగీర్, పెద్ద రసాలు, చిన్న రసాలు, బంగినపల్లి, సువర్ణ రేఖ కొబ్బరి అంటు, ముంత మామిడి, సన్నాకులు, దొండకాయ, ఇమామ్ పసంద్ తదితర రకాలు ఈ మేళాలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ మేళాకు వచ్చే వారు గుడ్డ సంచులు, గోగు నార సంచులు తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నామన్నారు . సమావేశంలో సంఘం నేతలు రుషి, నరేంద్ర, అశోక్ కుమార్, అప్పాజీ, సత్వ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు