కడలి న్యూస్:– ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగుల ఆనందానికి అవధులేకుండా పోయింది. ఈ సందర్భంగా డీఎస్సీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలిపే వీడియోను మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in సైట్ల ద్వారా అప్లై చేసుకోవచ్చు. వ్యక్తిగత, విద్యార్హతలు, టెట్, బీఈడీ లాంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలో తెలిపే ఈ వీడియోను మీరు. ఉపయోగించుకోవడంతో పాటు మీ సన్నిహితులకు SHARE చేయండి.
పాఠశాల విద్యాశాఖ- మెగా డీఎస్సీ-2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేది నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేది నుండి జులై 6 వ తేదీ వరకు సి.బి.టి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. మెగా డీఎస్సీ -2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు 20.04.2025 ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ 2໖໖ (https://cse.ap.gov.in/ https://apdsc.apcfss.in) నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది..