అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం. పార్లమెంట్ ఆవరణలో స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి




కడలి న్యూస్:-
 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్​ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. 
 అరకు ప్రాంతం నుంచి సేంద్రీయ విధానంలో ఉత్పత్తి చేసిన ఈ కాఫీ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉందని స్పీకర్ స్పష్టం చేశారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అరకు కాఫీని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. శాసనమండలి ప్రాంగణంలో మరో అరకు కాఫీ స్టాల్ ను ఛైర్మన్ మోషన్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్​, మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారిలు పాల్గొన్నారు. కాగా పార్లమెంటులోనూ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.

పార్లమెంట్ ఆవరణలో స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి


పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్ సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం, నలంద లైబ్రరీ వద్ద వాటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎంపీ కలిశెట్టికి లోక్ సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ లేఖ రాశారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు గతంలో లోక్ సభ స్పీకర్ ను కోరగా తాజాగా అనుమతి లభించింది.

కామెంట్‌లు