ఆచార్య కె యస్. చలంకు తమిళనాడు వి సి కె అంబేద్కర్ అవార్డు.

 


కడలి న్యూస్:–తమిళ నాడు వీసీ డాక్టర్ అంబేద్కర్ అవార్డు ఆచార్య కె యస్ .చలం కు ప్రకటించారు. ప్రతి సంవత్సరం డాక్టర్ అంబేద్కర్, పెరియార్ పేరు మీదుగా యిచ్చే ప్రతిష్టాత్మక అవార్డులను యీ ఏడాది ఆచార్య కే ఎస్ చలంకు, దేవనూర్ మహాదేవలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

ఆచార్య చలం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి జాతీయ స్థాయి రాజ్యాంగ పదవి పొందిన మొదటి ఆచార్యులు . (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా) అధ్యాపకులుగా ఏయు నుంచి మొట్టమొదటిసారిగా ఉన్నత  పదవి పొందారు. ఆ తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు వెంకయ్య నాయుడు, జస్టిస్ చలమేశ్వర్ రాజ్యాంగ పదవులు అలంకరించారు . ఆంధ్ర విశ్వవిద్యాలయం శత జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఈ అవార్డ్ రావటం విశ్వవిద్యాలయానికి, విశాఖ నగరానికి గౌరవం.

దేవనూర్ మహాదేవకు పెరియార్ అవార్డు ఇస్తున్నారు. దేవనూరు మహాదేవ ప్రముఖ కన్నడ రచయిత . గతంలో విసికె  అంబేద్కర్ అవార్డును తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు  ప్రధానం చేసారు.

ఆచార్య చలం రాసిన పుస్తకాలు మూడు తమిళంలోకి చింతన్ బుక్స్ చెన్నై వారు అనువాదం చెయ్యగా బహుళ ప్రాచుర్యం పొందాయి . నాల్గవ పుస్తకం ఇంగ్లీష్ లో వచ్చిన హ్యుమన్ డెవలప్మెంట్ ఇన్ సౌత్ ఇండియా ద్రవిడియన్ మార్వెల్ అన్నది ఇప్పుడు తమిళంలోకి అనువాదం అవుతోంది. ఆచార్య చలం  ఇంగ్లీష్ లో 28, తెలుగులో 14 పుస్తకాలు ప్రచురించారు. ఆయన రచనలలో బహుజన వాదం, మార్క్స్ అంబేద్కర్ ఫులే వాదనలే కాకుండా దేశంలో మొట్టమొదటిసారి మానవ అభివృద్ధిపై పరిశోధన చేసిన ప్రముఖులు. ఆర్ధిక శాస్త్ర ఆచార్యులుగా, ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ప్రసిద్ధులు. ఉత్తరాంధ్ర ఉద్యమ నిర్మాతగా తెలుగు వారికి చిరపరిచితులు. సాధారణంగా అవార్డులకు దూరంగా వుండే చలంతో విసికే పార్టీ కార్యదర్శి, ఎంపి రవికుమార్ మాట్లాడి ఇది చాలా గౌరవ ప్రదమైన అవార్డు అని, రాజకీయాలకు అతీతంగా దేశ గౌరవాన్ని పెంచే పెద్దలకే ఇస్తున్నామని, అంగీకరించాలని ఒప్పించారు. శుక్రవారం చైన్నైలో ఈ అవార్డును ప్రకటించారు

కామెంట్‌లు