అమెరికా లో జార్జియా రాష్ట్రంలో స్పీకర్, కౌన్సిల్ మెంబెర్స్ , ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
ప్రజలకు కల్పించే సేవలపై , ప్రస్తుత స్థితిగతులపై అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ
కడలి న్యూస్: అమెరికాలో పర్యటిస్తున్న జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ పలువురితో సమావేశమయ్యారు. జార్జియా రాష్టానికి చెందిన హౌస్ ఆఫ్ స్పీకర్ జాన్ బర్న్స్, జాన్ క్రీక్ కౌన్సిల్ మెంబర్ బాబ్ ఎర్రమిల్లి, సూ హాంగ్ రెప్రజెంటేటివ్ శ్రీని ఆవుల, రెప్రజెంటేటివ్ కార్టర్ బారెట్, రెప్రజెంటేటివ్ టాడ్ జోన్స్ లతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ప్రజా ప్రతినిధుల ఆలోచన విధానాల పట్ల కాసేపు ముచ్చటించారు. ప్రజలకు ప్రభుత్వం అందజేసే సేవలపై అడిగి తెలుసుకున్నారు.