మలేషియాలో మోదీ సందడి.. UPI, కొత్త కాన్సులేట్ ప్రకటన


 

కడలి న్యూస్:– మోదీ మలేషియా పర్యటన ఘనంగా సాగుతోంది. ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసే కీలక ప్రకటనలు చేశారు. త్వరలోనే మలేషియాలో భారత డిజిటల్ పేమెంట్ సిస్టమ్ UPI లాంఛ్ కానుందని వెల్లడించారు. ఇండియన్ స్టూడెంట్స్ కోసం ‘తిరువళ్లువర్ స్కాలర్షిప్', మలేషియాలో కొత్త ఇండియన్ కాన్సులేట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. OCI కార్డు సౌకర్యాన్ని ఆరో తరానికీ పొడిగిస్తున్నట్లు చెప్పి అక్కడి ప్రవాసుల్లో ఉత్సాహం నింపారు.


విద్యుత్ వినియోగదారుల కోసం 'డయల్ యువర్ సీఎండీ


విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి 'డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.


IMPS ట్రాన్సాక్షన్లపై SBI ఛార్జీలు


IMPS ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ఛార్జీల వసూలుకు SBI సిద్ధమైంది. రూ.25వేల-రూ.లక్ష వరకు రూ. 2+GST, రూ లక్షల-2 .6+GST, రూ.2లక్షల-5లక్షల వరకు రూ.6+GST వసూలు చేయనుంది. అయితే రూ.25వేల కంటే తక్కువ నగదు బదిలీకి ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వర్తిస్తాయి. FEB 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.



కామెంట్‌లు