కడలి న్యూస్, విశాఖపట్నం:– సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవోగా సీనియర్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జె. వెంకటరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం కాకినాడ జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌గా ఉన్న ఆయన సేవలను రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖకు అప్పగిస్తూ, తొలుత ఒక సంవత్సరం కాలానికి ఈ బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో అనంతపురం జిల్లా కేఆర్‌ఆర్‌సీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న డి. తిప్పే నాయక్ ను కాకినాడ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ (డీఆర్ఓ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

