గీతం ఆక్రమణలో ఉన్న భూములపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయన్న వైసీపీ..
భూముల వివరాలను బహిర్గతం చేయులని వైసీపీ డిమాండ్..
కడలి న్యూస్, విశాఖపట్నం:- విశాఖ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు కె.కె రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసన సభ్యులు , కార్పొరేటర్లు తో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ని కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా కె.కె రాజు మాట్లాడుతూ ఎండాడ – రుషికొండ గ్రామాలకు సంబంధించిన 54 ఎకరాలు 79 సెంట్ల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేటు యూనివర్సిటీకి (గీతం యూనివర్సిటీ) బదలాయించేందుకు ప్రతిపాదన రావడం వల్ల విశాఖ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విశాఖపట్నం రూరల్ తహసీల్దారు ద్వారా జీవీఎంసీ కమిషనర్ కి భూమి బదలాయింపు ప్రతిపాదన పంపడం జరిగింది. జనవరి 30న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను 15వ అంశంగా అజెండాలో చేర్చారు ఎలాంటి ప్రజాస్వామిక చర్చ లేకుండా సభ్యుల స్పష్టమైన ఆమోదం లేకుండానే ఏకపక్షంగా ఆమోదించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భూమి బదలాయింపును విశాఖపట్నం ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా కలెక్టర్ కి స్పష్టం చేశారు.
మొత్తం 54 ఎకరాలు 79 సెంట్లలో ఎంత ప్రభుత్వ భూమి ఉంది? అందులో గెడ్డ పోరంబోకు భూమి ఎంత? ఎస్ఐఓడి భూమి ఎంత మేరకు ఉంది? భూమి బదలాయింపు నిర్ణయానికి సంబంధించిన పూర్తి ఫైల్ వివరాలు ప్రజలకు తెలియజేయాలి. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గా ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తు చేస్తూ ఈ బదలాయింపును వెంటనే నిలిపివేయాలని కోరారు. గీతం యూనివర్సిటీకి భూమి బదలాయింపు అంశంపై ప్రజాభిప్రాయాన్ని గౌరవించి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు , తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి , శాసన మండలి సభ్యులు కుంభ రవి బాబు, డిప్యూటీ మేయర్ కట్టమురి సతీష్ , ఎస్.సి సి సభ్యులు బాణాల శ్రీనివాస్ , సంయుక్త కార్యదర్శి పి.వి.నారాయణ, కోరుకొండ వెంకట రత్న స్వాతి దాస్, పళ్ళ దుర్గ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉరుకూటి రామచంద్రరావు (చందు), పేడాడ రమణి కుమారి, బర్కత్ అలీ , బొండా ఉమా మహేశ్వర్ రావు , బోని శివ రామ కృష్ణ , జీలకర్ర నాగేంద్ర , కార్పొరేటర్లు దౌలపల్లి ఏడుకొండల రావు, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, వావిలపల్లి ప్రసాద్, రేయ్యి వెంకట రమణ, శేశికల్ , పివి సురేష్, గుడివాడ సాయి అనూష లతీష్, వార్డు అధ్యక్షులు బొడ్డేటి గోవింద్ , శ్రీనివాస్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్ , జిల్లా కార్యదర్శి ఉమ్మడి దాస్ పార్టీ నాయుకులు గుడివాడ లతీష్, సూర్య , మహేష్ , మూలక రెడ్డి , బంగారు భవాని శంకర్ , సాయి తదితరులు పాల్గొన్నారు .



