ప్రజా జీవితానికే మొదటి ప్రాధాన్యత :దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

 








పోటెత్తిన అభిమానులు కార్యకర్తలతో వంశీకృష్ణ జన్మదిన వేడుకలు

. నగర నలుమూలల నుంచి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు

భారీ గజమాలలు, కేకులతో సందడిగా మారిన వాతావరణం 

  కడలి న్యూస్, విశాఖపట్నం:– ప్రజా జీవితానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ నగర అధ్యక్షులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నియోజవర్గ అభివృద్ధి పాటు ప్రజల ఉన్నతకి నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ నగర అధ్యక్షులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే క్యాంప్ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నియోజవర్గానికి చెందిన అన్ని వార్డుల కూటమి నాయకులు, నాయకులు, అధికారులు, అనధికారులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై వంశీకృష్ణ శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా  కనకమహాలక్ష్మి దేవస్థానం వేద పండితుల చే ఆశీర్వాదం అందుకున్నారు. తదుపరి వార్డు అధ్యక్షులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో హాజరై సందడి వాతావరణాన్ని తలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదహారేళ్లుగా రాజకీయ రంగంలో ఉన్నానని ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ప్రజలకు సేవ చేయడంలో మాత్రం ముందుండేవాడినని తెలియజేశారు. రెండు దపాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఓటమి చెందానని అయితే మూడోసారి భారీ మెజారిటీతో దక్షిణ నియోజకవర్గం ప్రజలు తనను ఆశీర్వదించారు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేత్యత్వంలో మరింత కష్టపడి పనిచేసి నియోజవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. తన జన్మదిన పురస్కరించుకొని ప్రత్యక్షంగా  వేలాది సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, అధికారులు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.

కామెంట్‌లు