వర్కింగ్ జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం
ఫెడరేషన్ రాష్ట్ర డైరీ ఆవిష్కరణ
కడలి న్యూస్, విశాఖపట్నం:– జిల్లా అభివృద్ధిలో వర్కింగ్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సేవలు అభినందనీయమని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కొనియాడారు.. శుక్రవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 2026 వార్షిక డైరీని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.... ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులతోనే సమాజ ప్రగతి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరు కూడా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.. అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 11 నుంచి జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. డాల్ఫిన్ డయాగ్నసిస్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి కేజీహెచ్ లో అత్యుత్తమ వైద్యులు జర్నలిస్టులకు తమ సేవలు అందించడం జరుగుతుంది అన్నారు.. కావున జిల్లాలో జర్నలిస్టులు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ లు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.. కేంద్ర . రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు జర్నలిస్టులు సమస్యలను తెలియజేసి పరిష్కారానికి తమ యూనియన్ల ద్వారా కృషి చేయడం జరుగుతుంది అన్నారు. గత నెల 28 నుంచి యూనియన్ ద్వారా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారంతో ముగు స్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి రవికుమార్, పిఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్, పి నగేష్ బాబు, టి .కృష్ణమూర్తి నాయుడు, భాగ్యరాజు, బ్రాడ్ కాస్ట్ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మళ్ళదేవ త్రినాధ్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఎస్ జగన్మోహన్ , ఉపాధ్యక్షులు డి చక్రపాణి, కొణతాల శ్రీనివాస్, కోశాధికారి కేవి శర్మ, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్, కార్యవర్గ సభ్యుడు అరుణ్ భాస్కర్ (హరి), సభ్యుడు ఎం హరనాథ్. పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. తొలుత గంట్ల శ్రీనుబాబు జిల్లా కలెక్టర్ ను ఘనంగా సత్కరించారు.
